‘సర్‘ నిరసనల్లో రాహుల్ తో విజయ్ కలుస్తారా?
x

‘సర్‘ నిరసనల్లో రాహుల్ తో విజయ్ కలుస్తారా?

తొలిసారి తమిళనాడులో భేటీ అయిన అగ్రనేతలు


Click the Play button to hear this message in audio format

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్, శనివారం చెన్నైకి వచ్చిన లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆతిథ్యం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వీరి మధ్య మొదటిసారిగా ఈ సమావేశం జరిగింది.

కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘ఛత్రోన్ కి గూంజ్’ ఆరవ ఎడిషన్ ను చెన్నైలో నిర్వహించేందుకు రాహుల్ చెన్నైకి చేరుకున్నారు. ఆయన ఈ సమావేశంలో భాగంగా పలవక్కంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న బాస్క్ కేప్ లో ఏకాంతంగా భోజనం చేసి, తరవాత కాఫీ తాగారు. విజయ్ పూలబొకెతో స్వాగతం పలికారని, కూటమి కార్యాచరణపై ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారని పలు వర్గాలు తెలిపాయి.

నిరసనలు..

ఈ సమయం, సమావేశానికి ప్రాధాన్యత తీసుకొచ్చింది. సర్ కు వ్యతిరేకంగా ఢిల్లీ, చెన్నై సహ పలు నగరాల్లో రాజకీయ పార్టీలు నిరసనలు చేస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ కింద సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై రాహుల్ తన గళాన్ని వినిపిస్తున్నారు. అయితే విజయ్ సర్ పై తన వైఖరిని ఇప్పటి వరకూ ప్రకటించలేదు.
సీఈసీ కుమార్ రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్న ఏఐఎస్ఎఫ్, ఏఐవైఫ్ కు చెందిన వంద మందిని విజయ్ సర్కార్ అరెస్ట్ చేసింది. ఈ రెండు వర్గాలకు చెందిన రాజకీయా పార్టీలు విజయ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తున్నాయి.

ఉప ఎన్నికల ఫలితాలు..

ధారపురం, మధురాంతకం ఉప ఎన్నికల్లో టీవీకే విజయం సాధించిన తరువాత ఈ సమావేశం జరిగింది. ఇద్దరు నాయకుల మధ్య వ్యక్తిగత సత్సంబంధాలు ఉన్నాయని, ఈ సమావేశం జాతీయ ప్రాముఖ్యత పొందిందని సీనియర్ జర్నలిస్ట్ తరాసు శ్యామ్ అభివర్ణించారు. విజయ్ ఇండి కూటమితో ధృడంగా ఉన్నారా లేరా అనేది ఈ సమావేశంతో తేలిపోతుందని, సర్ కు సంబంధించిన నిరసనల్లో విజయ్ ను చేరమని రాహుల్ ఆహ్వానించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘ఇప్పటి వరకూ విజయ్ రాహుల్ ను కలవకుండా వచ్చాడు. ఇపపుడు కలవడంతో ఇది పొత్తులో పురోగతికి సంకేతం. వారిద్దరూ కలిసి ఎలా ముందుకు సాగుతారో చూడాలి’’ అని శ్యామ్ అన్నారు.
ఉప ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఈ సమావేశం ఖరారు అయినట్లు కనిపిస్తోందని రాజకీయ వ్యాఖ్యాత దయాలన్ షణ్ముగం అభిప్రాయపడ్డారు. ఒక వేళ టీవీకే సొంత బలంగా మీద గెలిచి ఉంటే విజయ్ కు బేరసారాల శక్తి మరింత పెరిగి ఉండేదని చెప్పుకొచ్చారు. విజయ్ వర్గం ముందుగానే ఊహించి, చర్చలకు సిద్దపడిందని ఆయన అన్నారు. ‘‘రాహుల్ కు విజయ్ అవసరం, విజయ్ కు రాహుల్ అవసరం’’ అని ఆయన అన్నారు.

తటస్థ వైఖరి..

ఈ సమావేశం విజయ్ రాజకీయ వైఖరిపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. టీవీకే గతంలో ఇండి కూటమికి దూరంగానే ఉంది. కానీ కొన్ని సమావేశాలకు హాజరైంది. అదే సమయంలో మోదీతోనూ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ రెండు అంశాలను విశ్లేషకులు గమనిస్తున్నారు. ప్రతిపక్షాలతో అవగాహానను పటిష్టం చేసుకోవడం, కేంద్రంలో బీజేపీతో తక్షణ నాయకత్వ ఘర్షణను నివారించడం దీని ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నారు.
‘‘విజయ్ సర్ నిరసనల్లో పాల్గొంటారు. లేక ఇతర మార్గాల్లో వెళతారా అనేది స్పష్ఠం తెలియదు. పనులు సజావుగా సాగాలంటే బీజేపీతో మంచి అనుబంధాలు అవసరం. మోదీ పర్యటన గణనీయమైన దృష్టిని ఆకర్షిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ రెండు సమావేశాలు విషయంలో విజయ్ పరిస్థితులు ఎలా సమతుల్యం చేస్తారో మనం నిశితంగా గమనించాలి’’ అని దయాలన్ అన్నారు.
కేంద్రంలోని అధికార పక్షంతో విజయ్ తన సంబంధాలను చక్కదిద్దుకుంటూనే, తన కూటమి భాగస్వాములతోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే జాతీయ స్థాయిలో టీవీకే, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం మధ్య మరింత సమన్వయం కుదరడానికి ఒక సంకేతంగా చెప్పవచ్చు.
Read More
Next Story