తమిళనాడులో దళపతి ప్రభంజనం..
x
టీవీకే అధినేత విజయ్

తమిళనాడులో దళపతి ప్రభంజనం..

స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న విజయ్


Click the Play button to hear this message in audio format

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తల్లకిందులయ్యాయి. అంతా అనుకున్నట్లుగా డీఎంకే కాకుండా, ఎవరూ ఊహించని టీవీకే పార్టీ అధికారం దిశగా దూసుకుపోతోంది.ఎన్నికల సంఘం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం టీవీకే 108 స్థానాలలో ఆధిక్యంలో ఉంది.

ఆ పార్టీకి మరో పది స్థానాలు దక్కితే సొంతంగా అధికారం దక్కించుకునే అవకాశం ఉంది. ప్రతిపక్షంగా ఉన్న మరో ద్రవిడ పార్టీ అన్నాడీఎంకే 71 స్థానాలలో ముందంజ లో ఉంది. డీఎంకే పార్టీ కేవలం 38 స్థానాలలో మాత్రమే ఆధిక్యం కనపరుస్తోంది.

టీవీకే పార్టీకి 30 శాతం పైగా ఓట్లు వచ్చాయి. అన్నాడీఎంకే కూటమికి 25 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. డీఎంకే పార్టీ అధికారంలో ఉండగా సాగించిన పాలనపై ప్రజలు విసుగెత్తిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. హిందూ వ్యతిరేక విధానాలు, శాంతిభద్రతలపై రాజీపడటం, కల్తీ మద్యంతో పదుల సంఖ్యలో సాధారణ ప్రజలు మరణించడం వంటివి డీఎంకు మైనస్ గా మారింది.
విజయ్ కు ప్లస్ పాయింట్..
సినిమాలో సూపర్ స్టార్ గా ఉన్న విజయ్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది. ఆయన సభలకు జనం తండోపతండాలుగా వచ్చారు. తను దేవుడిని నమ్ముతానని ప్రకటించడం కూడా టీవీకే కు కలిసివచ్చింది. ముఖ్యంగా కరూర్ తొక్కిసలాట తరువాత జరిగిన పరిణామాలు ఆయనను వేధిస్తున్నారనే జనం భావించారు. ఆ సింపతే ఓట్లు, సీట్లుగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరో వైపు ఒంటరిగా పోటీ చేయడం, ఎన్నికల ప్రచార సభల్లో స్టాలిన్ ను అంకుల్ అంటూ విజయ్ సంబోధించడం, ఆకట్టుకునే ప్రసంగాలు యువతను పోలింగ్ కేంద్రాల వైపు నడిపించేలా చేసింది. అందుకే తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి పోలింగ్ నమోదుకు విజయ్ ఫ్యాక్టరే కారణంగా తేలుతోంది.
హంగ్ వస్తే...
ప్రస్తుతం టీవీకేకు స్పష్టమైన అధికారం దక్కాలంటే మరో పది స్థానాలు అవసరం. అయితే కాంగ్రెస్, వామపక్షాల వంటి వాటితో ఆయనకు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో వారి సాయంతో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Read More
Next Story