‘‘2021, 2024 లోనూ ఇలాంటి కథలే చెప్పారు’’: మమతా బెనర్జీ
x
మమతా బెనర్జీ

‘‘2021, 2024 లోనూ ఇలాంటి కథలే చెప్పారు’’: మమతా బెనర్జీ

ఎగ్జిట్ పోల్స్ ను నమ్మడం లేదన్న బెంగాల్ సీఎం


Click the Play button to hear this message in audio format

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడిన ఎన్నికల అంచనాలు(ఎగ్జిట్ పోల్స్) ను తిరస్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే ఉద్దేశ్యంతోనే అటువంటి సర్వేలను ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 200కు పైగా సీట్లను సునాయాసంగా కైవసం చేసుకుంటోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఫలితాల ప్రకటనకు రెండు రోజుల ముందు వర్చువల్ సమావేశం ద్వారా పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన, రాజీలేని ప్రచారం చేసినందుకు కార్యకర్తలను బెనర్జీ అభినందించారు.
పార్టీ ఎన్నికల పనితీరుపై తనకున్న విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. టీఎంసీ "గెలుస్తుందని, అది కూడా 200కు పైగా సీట్లతో విజయదుందుభి మోగిస్తుంది" ఆమె పార్టీ నాయకులతో అన్నారు. గత ఎన్నికల్లో కూడా ఇలాంటి కథనాలే తీసుకువచ్చారని ఆరోపించారు. కానీ అవేవీ నిజం కాలేదని పేర్కొన్నారు.

ఎగ్జిట్ పోల్స్‌పై విమర్శలు

"ఎగ్జిట్ పోల్స్ అనేవి స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేసే ప్రయత్నం తప్ప మరేమీ కాదు. వారు 2021, 2024లోనూ ఇప్పుడు కూడా ఇదే చేశారు" అని బెనర్జీ అన్నట్లు ఇండియా టుడే వర్గాలు పేర్కొన్నాయి.
సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ సమావేశం ప్రారంభం అయింది. ఈ వర్చువల్ సమావేశానికి, పార్టీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్లందరితో పాటు, సీనియర్ నాయకులు, జిల్లా కోఆర్డినేటర్లు, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు హాజరయ్యారు.
కౌంటింగ్ రోజు సన్నాహాలు స్థానిక మీడియా నివేదికల ప్రకారం, కౌంటింగ్ రోజు సన్నాహాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కౌంటింగ్ కోసం స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బయటకు తీసుకువచ్చిన తర్వాత అనుసరించాల్సిన ప్రోటోకాల్స్‌పై ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. పోలింగ్ సమయంలో మోహరించిన కేంద్ర బలగాల ప్రవర్తనపై బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. పలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులపై జరిగిన దాడుల మీద ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీకోసం నిలబడిన వారిని తాము అస్సలు మరిచిపోమని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర బలగాలను ఉపయోగించి బీజేపీ ఓటింగ్‌ను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.
"వారు ప్రతి గ్రామంలోకి, వీధిలోకి వెళ్లి మహిళలపై దాడి చేశారు, పిల్లలను కూడా వదల్లేదు. మీడియాలోని ఒక వర్గం కూడా వారికి సాయం చేస్తోంది," అని ఆమె అన్నారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి పార్టీ అగ్ర నాయకత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, ప్రతి రౌండ్‌లో జరుగుతున్న పరిణామాలను నివేదిస్తూ, లెక్కింపు ప్రక్రియ పూర్తిగా పూర్తయ్యే వరకు అక్కడినుంచి వెళ్ళవద్దని కౌంటింగ్ ఏజెంట్లకు బెనర్జీ, అభిషేక్ ఆదేశించినట్లు ఒక సీనియర్ టీఎంసీ నాయకుడు తెలిపారు.
Read More
Next Story