
ఉద్దవ్ ఠాక్రే
న్యాయస్థానానికి చేరిన ఉద్దవ్ గ్రూపు ఎంపీల విలీనం
స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
శివసేన ఉద్దవ్ గ్రూపు కు చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్ నాథ్ షిండే గ్రూపులో చేరినట్లు స్పీకర్ ఇచ్చిన ఆమోదంపై ఉద్దవ్ గ్రూప్ న్యాయస్థానంలో ఛాలెంజ్ చేసింది. మంగళవారం ఆ గ్రూపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శివసేన (యూబీటీ) తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్, ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జయమల్య బాగ్చీ, విపుల్ ఎం పాంచోలీలతో కూడిన ధర్మాసనం ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ఈ పిటిషన్‌ను బుధవారం విచారణకు జాబితా చేయాలని కామత్ ధర్మాసనాన్ని కోరారు. "చూస్తాం," అని సీజేఐ అన్నారు. జూలై 18న, షిండే నేతృత్వంలోని శివసేనలో ఆరుగురు శివసేన (యూబీటీ) ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం తెలిపారని కామత్ ధర్మాసనానికి తెలిపారు.
"ఆరుగురు ఎంపీల విలీనాన్ని స్పీకర్ గుర్తించారు" అని ఆయన అన్నారు. తాము ఎవరిపై పోటీ చేసి ఎన్నికల్లో గెలిచారో వారితోనే ఎంపీలు విలీనం అవుతుండటంతో ఇది ఒక జాతీయ దృగ్విషయంగా మారిందని ఆయన అన్నారు.
వర్షాకాల సమావేశాలకు ముందు, జూలై 18న బిర్లా ఆరుగురు శివసేన (యూబీటీ) ఎంపీలను షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం చేయడానికి ఆమోదం తెలిపారు. ఇంతకుముందు టీఎంసీ ఎంపీలు కూడా ఇదే తరహాలో ఎన్సీపీఐ అనే పార్టీలో చేరారు. ఆమ్ ఆద్మీ నుంచి ఫిరాయించిన ఏడుగురు ఎంపీలు కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
Next Story

