టైగర్ ష్రాఫ్ పై కాల్పులు: ముగ్గురి అనుమానితుల అరెస్ట్
x

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు: ముగ్గురి అనుమానితుల అరెస్ట్

రాజస్థాన్ లోని కోటా రైల్వే స్టేషన్ లో దొరికిన దుండగులు


Click the Play button to hear this message in audio format

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై ముంబాయిలో కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న ముగ్గురి రాజస్థాన్ లోని కోటా రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే బాధ్యత వహించింది. అయితే దర్యాప్తు అధికారులు ఈ వాదనపై ఇంకా విచారణ జరుపుతున్నారు. అరెస్ట్ అయిన ముగ్గురు షూటర్లు బిష్ణోయ్ గ్యాంగ్ లో సభ్యులని జాతీయ మీడియా వార్తా కథనాలు ప్రసారం చేసింది. నిందితులలో ఇద్దరు హర్యానాకు చెందిన వారని, ఒక బీహర్ అని కోటా ఎస్పీ తేజస్వని గౌతమ్ జాతీయ మీడియాకు తెలిపారు.

రెక్కీ..

దాడి చేసినవారు శిక్షణ తీసుకున్న షూటర్లు అని, వారు దాడి చేయడానికి ముందే రెక్కీ నిర్వహించారని దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి. ‘‘కోటా జిల్లా పోలీసులు వారిని రైలులో పట్టుకుంది’’ అని గౌతమ్ ప్రకటించారు. టైగర్ ఆదివారాల్లో జుహూ ఫుట్ బాల్ మైదానానికి వెళ్తాడని ఈ బృందం గుర్తించిందని, కారులో అక్కడికి వెళ్తుండగా దాడి చేశారు.
దాడి తరువాత విలే పార్లే, అంధేరీ మీదుగా ఎస్వీ రోడ్డు గుండా తప్పించుకునే మార్గాన్ని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. దాడి తరువాత అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో తమ బైక్ లను వదిలి బోరివాలీ వైపు వెళ్లే రైలు ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. తరువాత దుండగులు గుజరాత్ కు వెళ్లారు.
ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహు ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్, మరో వ్యక్తికి మాత్రం బుల్లెట్ గాయాలయ్యాయి.

సీఎం ఏమన్నారంటే..

ఈ కాల్పుల ఘటనను మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కాల్పులు జరిపిన వారిని, దాని వెనకున్న వారిని ప్రభుత్వం పట్టుకుంటుందని, ఇలాంటి చర్యలను సహించేది లేదన్నారు. నిందితుల గుర్తింపును సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు లభించాయని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఫడ్నవీస్ నాగ్ పూర్ లో విలేకరులతో అన్నారు. నిందితులు వేరే రాష్ట్రాలు, విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, వారిని పట్టుకోవడానికి పోలీసులు ఇతర దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకుంటుందని కేంద్ర ఏజెన్సీల సాయం కోరతామని ప్రకటించారు.
Read More
Next Story