కేతన్ కేసులో ‘నడక’ విశ్లేషణ కీలకంగా మారుతుందా?
x

కేతన్ కేసులో ‘నడక’ విశ్లేషణ కీలకంగా మారుతుందా?

సీసీటీవీ ఫుటేజ్ తో కొత్త వీడియోలను ఫ్రేమ్ బై ఫ్రేమ్ పరిశీలించబోతున్న దర్యాప్తు అధికారులు


Click the Play button to hear this message in audio format

కాబోయే భర్తను పక్కా ప్రణాళికతో ప్రియుడితో కలిసి హత్య చేసిన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దర్యాప్తు అధికారులకు నేరాన్ని నిరూపించడానికి అనేక సాంకేతిక ప్రక్రియల సాయం తీసుకుంటున్నారు. అయినప్పటికీ అవి కచ్చితమైన ఫలితాలను ఇస్తాయనే నమ్మకాన్ని వారు ఇవ్వలేకపోతున్నారు. కోర్టులో ఈ హత్య నిలబడే విధంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే నేర స్థలంలో ప్రధాన నిందితులైన వీరితో రెండు సార్లు విడిగా దర్యాప్తు అధికారులు సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు. జూన్ 18న కేతన్(26) ప్రాణాలు కోల్పోయిన లోహగఢ్ కోట సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, షార్ట్స్ , హుడ్ ధరించిన వ్యక్తి, కేతన్, సియాలను వెంబడిస్తున్నట్లు పూణే పోలీసులు గుర్తించారు. అయితే సీసీ కెమెరాలో ఎక్కడా కూడా చేతన్ గురించిన ముఖం ఎక్కడా కనిపించలేదు. ఆ వ్యక్తే చేతనే అని కోర్టులో నిరూపించడానికి మరింత బలమైన ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

నడక విశ్లేషణ..

నడక విశ్లేషణ అనేది ఫోరెన్సిక్ పద్దతిలో జరుగుతుంది. ఒక వ్యక్తి నడిచే విధానం వారి శరీర భంగిమ, అడుగు పొడుగు, అవయవాల కదలిక, మొత్తం శరీర కదలికలు అన్నింటిని పరిశీలిస్తుంది. ముఖం కనిపించకుండా చాలా కష్టమైన సందర్భాలలో దీనిని ఉపయోగిస్తారు.
ప్రస్తుతం దర్యాప్తు అధికారులు సీసీటీవీలో కనిపించిన దుస్తులనే చేతన్ కు వేసి, అదే మార్గంలో తిరిగి నడిపించాలని భావిస్తున్నారు. తరువాత దీనిని సీసీటీవీ ఫుటేజ్ తో సరిపోల్చి చూస్తారు. ఈ ప్రక్రియలో ఫోరెన్సిక్ నిఫుణులు ముఖ కవళికల కంటే నడక, కదలికలలో సరిపోలే నమూనా కోసం వెతుకుతారు.

పరిమితులు..

ఛత్తీస్ గఢ్ లో జరిగిన ముఖేష్ చంద్రకర్ హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు అధికారిగా పనిచేసిన మయాంక్ గుర్జర్ ప్రకారం.. ఒక వ్యక్తి నడక వారి అస్థిపంజర నిర్మాణం, బయో మెకానిక్స్ ద్వారా వస్తుందని, అనుమానితులు గుర్తింపును దాచుకోవడానికి ప్రయత్నించిన తరువాత కూడా ఈ లక్షణాలు ఉంటాయని పేర్కొన్నారు.
సీసీటీవీ ఫుటేజ్ కు, దర్యాప్తు అధికారులు తీసిన వీడియో ఆధారంగా సాక్ష్యాలను బలోపేతం చేయగలదు. అయితే ఈ విశ్లేషణ కేవలం నిర్ధారణ మాత్రమే అని, బలపరిచేది కాదని గుర్జర్ అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా...

ఈ విశ్లేషణ పోలీసులకు కొత్తేమీ కాదు. ఫుటేజ్ చాలా అస్పష్టంగా ఉన్నప్పుడూ లేదా అనుమానితులు తమ ముఖాలను దాచుకున్నప్పుడూ హత్య, దోపిడీ, లైంగిక దాడి దర్యాప్తులలో బ్రిటిష్ దళాలు ఉపయోగించాయి. అంతేకాక 2011 లండన్ అల్లర్లలో పాల్గొన్నవారికి గుర్తించడానికి ఉపయోగించారు.
చైనా ఒక అడుగు ముందుకు వేసి ఏఐ ఆధారిత నడక గుర్తింపును తన విస్తృత నిఘా మౌలిక సదుపాయాలలో విలీనం చేసింది. అయితే దేశంలో మాత్రం ఇది ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. మరో వైపు కేతన్ మరణం తరువాత అతని ఫోన్ నుంచి కీలకమైన డేటాను ఏమైనా తొలగించారా అనే కోణంలో కూడా దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే అది కొంతకాలం అది సియా దగ్గర ఉన్నట్లు భావిస్తున్నారు.
జూన్ 18న సియాతో కలిసి లోహగఢ్ కోటలో ట్రెక్కింగ్ కు వెళ్లిన సమయంలో కేతన్ ను కొండ పై నుంచి తోసేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ జంట నవంబర్ లో వివాహం చేసుకోబోతున్నారు. కేతన్ ను చంపడానికి సియా- చేతన్ లో కుట్రపన్ని కొండపై నుంచి తోసేశారు. ప్రస్తుతం వీరు ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు.
Read More
Next Story