‘‘మహిళలకు ఇచ్చిన హమీలు ఎప్పుడు అమలు చేస్తారు’’: ఆతిశీ
x
అతీశీ మార్లేనా

‘‘మహిళలకు ఇచ్చిన హమీలు ఎప్పుడు అమలు చేస్తారు’’: ఆతిశీ

‘ఆప్’ ఎంపీల విలీనం రాజ్యాంగ విరుద్దమన్న మాజీ సీఎం


Click the Play button to hear this message in audio format

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో గెలిస్తే మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామనే వాగ్థానం ఏమైందని మాజీ ముఖ్యమంత్రి అతిశీ మంగళవారం బీజేపీని ప్రశ్నించారు. ఏడుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనం కావడాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఈ చర్య రాజ్యాంగ విరుద్దమని అభివర్ణించారు.

విలేకరుల సమావేశంలో అతిషి మాట్లాడుతూ, గత ఏడాది జనవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ ఏడాది మార్చి 8 నుంచి దేశ రాజధానిలోని మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,500 జమ కావడం ప్రారంభిస్తుందని బీజేపీ హామీ ఇచ్చిందని అన్నారు. మహిళలు తమ మొబైల్ నంబర్లను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకోవాలని, డబ్బు బదిలీని నిర్ధారిస్తూ వారికి ఒక SMS వస్తుందని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.
"2025 మార్చి 8 గడిచిపోయింది, ఇప్పుడు 2026 మార్చి 8 కూడా గడిచిపోయింది. కానీ ఢిల్లీలోని మహిళల ఖాతాల్లో రూ. 2,500 జమ కాలేదు" అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అన్నారు. 'నెలవారీ డబ్బు కోసం మహిళలు ఇంకా ఎదురుచూస్తున్నారు' ఈ హామీ ఆధారంగా బీజేపీ మహిళల ఓట్లను గెలుచుకుందని ఆతిషి ఆరోపించారు. ఆర్థిక సాయం ఎప్పుడు అందిస్తారనే దానిపై నగరంలోని మహిళలు ఇంకా ఎదురుచూస్తున్నారని అన్నారు.
ప్రజలు సేవలు పొందడంలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో డీటీసీ బస్సుల్లో సులభంగా ప్రయాణించిన వారు ఇప్పుడు పింక్ కార్డుల కోసం క్యూలలో నిలబడుతున్నారని, అలాగే ఉచిత మందులు, చికిత్స, పరీక్షలు పొందడం కూడా కష్టంగా మారిందని ఆమె ఆరోపించారు.

అది రాజ్యాంగ విరుద్దం..

బీజేపీలో ఎంపీల విలీనంపై, దానిని అంగీకరించాలన్న రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయం రాజ్యాంగ నిబంధనలకు, ఫిరాయింపుల నిరోధక చట్టాలకు విరుద్ధమని ఆప్ నాయకురాలు అన్నారు. ఒక విలీనాన్ని గుర్తించాలంటే, అసలు రాజకీయ పార్టీ, శాసనసభ పక్షంలో కనీసం మూడింట రెండు వంతుల మద్దతుతో విలీనం కావాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందని ఆమె అన్నారు.
అసలు పార్టీ విలీనం కాకుండా కేవలం మూడింట రెండు వంతుల ఎంపీలు మరో రాజకీయ పార్టీలో విలీనం కావడానికి అనుమతించే రాజ్యాంగ నిబంధన ఏదీ లేదు. ఈ చర్య ఫిరాయింపుల నిరోధక చట్రాన్ని ఉల్లంఘిస్తుందని ఆప్ నాయకులు విమర్శించారు. రాజ్యాంగ, చట్టపరమైన మార్గాల ద్వారా ఈ విషయాన్ని లేవనెత్తుతూనే ఉంటామని తెలిపారు.
Read More
Next Story