
పెద్ది దుమ్మురేపుతోంది! రిలీజ్ ముందే సెన్సేషన్
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం. రౌండప్
1) ‘పెద్ది’ దుమ్మురేపుతోంది! రిలీజ్ ముందే సెన్సేషన్ 2) ఇందిరమ్మ ఇళ్ల లిస్టుపై కాంగ్రెస్‌లో రచ్చ! 3) గల్లీ కో బెల్ట్..! 24/7 మద్యం దందా!
1) ‘పెద్ది’ దుమ్మురేపుతోంది!
రిలీజ్ ముందే సెన్సేషన్రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా సుమారు 3000 స్క్రీన్లలో విడుదల కానుంది. ఈ సినిమా సుమారు రూ. 218.50 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 135 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరగగా, బ్రేక్ ఈవెన్ కోసం సుమారు రూ. 220 కోట్ల టార్గెట్ ఉంది. నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ గ్రాస్ దాటి రికార్డు క్రియేట్ చేసింది. డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. 1980ల ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, ఒక యువకుడి జీవితం, అతని మార్పు ప్రయాణం మరియు ఎదురైన సవాళ్లను భావోద్వేగాలు, యాక్షన్‌తో చూపించనుంది.
2) ఇందిరమ్మ ఇళ్ల లిస్టుపై కాంగ్రెస్‌లో రచ్చ!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. గ్రామాలకు పరిమిత కోటా ఉండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలోనే స్థానిక నేతల మధ్య “నా మనుషులు–నీ మనుషులు” అనే స్థాయిలో వర్గపోరు మొదలైంది. మరోవైపు, అర్హులను పక్కన పెడుతున్నారనే ఆరోపణలతో బీఆర్ఎస్ గ్రామాల్లో ఆందోళనలు, నిరసనలు చేపడుతోంది. దీంతో అధికారులు రాజకీయ ఒత్తిడిలో చిక్కుకుని, నిజమైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై అనుమానాలు పెరుగుతున్నాయి.ఒకే గ్రామం… ఒకే పథకం… కానీ రెండు లిస్టులు! నిజంగా ఎవరికి వస్తున్నాయి ఇందిరమ్మ ఇళ్లు? ఇందిరమ్మ ఇళ్ల పథకం చిచ్చు రేపుతోందా?
3) గల్లీ కో బెల్ట్..! 24/7 మద్యం దందా!
శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, నియోజకవర్గ మహిళల ఫిర్యాదులపై స్పందిస్తూ పోలీసులతో కలిసి అక్రమ బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే అనధికార మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఇళ్ల మధ్య నడుస్తున్న ఈ బెల్ట్ షాపులు రాత్రివేళల్లో భయాందోళనలను పెంచుతున్నాయని ప్రజల ఆరోపణ. తెలంగాణా మొత్తం పరిస్థితి ఇదే. గల్లీలో కనిపించేది చిన్న షాప్ మాత్రమే. కానీ వెనుక నడుస్తున్నది పెద్ద వ్యవస్థ. గల్లీ బెల్ట్ షాపుల దందా, ఎవరి అండతో నడుస్తోంది?

