
పబ్‌పై డీసీపీ మెరుపుదాడి|టీచర్ డ్రీమ్‌కు ఫైనల్ కాల్|యుద్ధవిమానాల గర్జన
కింగ్స్ & క్వీన్స్ పబ్‌పై డీసీపీ రితిరాజ్ మెరుపుదాడి
హైదరాబాద్‌లో నైట్‌లైఫ్ పెరుగుతున్న కొద్దీ పబ్‌లలో నిబంధనల ఉల్లంఘనలు, అసాంఘిక కార్యకలాపాలపై ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ అండర్‌కవర్‌గా కేపీహెచ్‌బీలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో తనిఖీలు నిర్వహించి ఆధారాలు సేకరించారు. అనంతరం పోలీస్ బృందంతో మెరుపు దాడి చేసి పబ్ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు.
TET బెల్ రింగైంది! టీచర్ డ్రీమ్‌కు ఫైనల్ కాల్...
టీచర్ కావాలనే లక్ష్యంతో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు టెట్ పరీక్షల సమయం ఆసన్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షల ఏర్పాట్లు పూర్తి కాగా, వేలాది మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉపాధ్యాయ నియామకాలకు తొలి అర్హత పరీక్షగా భావించే టెట్‌లో మెరుగైన ప్రతిభ కనబర్చేందుకు అభ్యర్థులు తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు.
యుద్ధవిమానాల గర్జన! ఆదిలాబాద్‌లో మెగా ఎయిర్ బేస్!
ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ త్వరలో దేశ రక్షణ రంగంలో కీలక కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సాధారణ ఎయిర్‌స్ట్రిప్‌గా ఉన్న ఈ ప్రాంతాన్ని సివిల్–మిలిటరీ ఎయిర్‌బేస్‌గా అభివృద్ధి చేసే అంశంపై కేంద్ర రక్షణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతున్నాయి. పౌర విమానాశ్రయంతో పాటు భారత వైమానిక దళానికి ఫ్లయింగ్ ట్రైనింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. వ్యూహాత్మక స్థానం కారణంగా ఆదిలాబాద్‌ను భవిష్యత్తులో ఫైటర్ జెట్ శిక్షణ హబ్‌గా తీర్చిదిద్దే యోచనలో ఉన్నారు.

