మీరు తింటున్న చేప... సేఫ్‌నా?
x

మీరు తింటున్న చేప... సేఫ్‌నా?

గల్ఫ్ నుంచి... కన్నీటి కబురు | ఫ్యూచర్ సిటీ? పెట్టుబడులకు కొత్త అడ్రస్


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం. రౌండ‌ప్‌లో మూడు వార్త‌లు

1) ఫ్యూచర్ సిటీ? పెట్టుబడులకు కొత్త అడ్రస్

2) గల్ఫ్ నుంచి... కన్నీటి కబురు

3) మీరు తింటున్న చేప... సేఫ్‌నా?

1) ఫ్యూచర్ సిటీ? పెట్టుబడులకు కొత్త అడ్రస్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ (Fourth City) ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు అనుబంధంగా ప్రపంచ స్థాయి పెట్టుబడులు, టెక్నాలజీ కేంద్రంగా ఈ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. ప్రాజెక్ట్ పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన FCDA కార్యాలయాన్ని సి.ఎం. రేవంత్‌రెడ్డి ఈరోజు ప్రారంభించారు. AI హబ్, డేటా సెంటర్లు, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ విలేజ్, విద్యా–పరిశోధనా కేంద్రాలు వంటి అనేక ప్రాజెక్టులు ఇందులో భాగం కానున్నాయి. అలాగే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్య శిక్షణ అందించనున్నారు. మొత్తం మాస్టర్ ప్లాన్ పరిధి 765.28 చ.కి.మీ.గా ఉండి 56 గ్రామాలను కలుపుతోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థను కూడా ప్రభుత్వం రూపొందిస్తోంది.

2) గల్ఫ్ నుంచి... కన్నీటి కబురు

గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ వలస కార్మికుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమైంది. దుబాయ్‌లో జరిగిన బస్సు–ట్రక్ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ కార్మికులు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. దీంతో ఎన్‌ఆర్‌ఐ సంక్షేమం, రవాణా భద్రతపై చర్చ మొదలైంది. ప్రతి ఏడాది గల్ఫ్ దేశాల్లో వందలాది తెలంగాణ కార్మికులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ ఘటనలు తగ్గకపోవడం, భద్రతా వ్యవస్థ బలోపేతం కాకపోవడంపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి. గల్ఫ్‌లో పనిచేస్తున్న లక్షలాది తెలంగాణ కార్మికుల కోసం ప్రత్యేక రక్షణ వ్యవస్థ అవసరం.

3) మీరు తింటున్న చేప... సేఫ్‌నా?

హైదరాబాద్‌లో రోజూ 500–600 టన్నుల చికెన్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి చెంగిచెర్ల రెండరింగ్ ప్లాంట్‌కు వెళ్లాల్సి ఉండగా, పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ చేపల చెరువులకు అక్రమంగా తరలిస్తున్న నెట్‌వర్క్‌ను GHMC, H-FAST అధికారులు గుర్తించారు. 7 లారీల్లో 90–120 టన్నుల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. రోజూ 20–30 లారీలు, ఆదివారాల్లో 30–60 లారీలు వరకు వ్యర్థాలు అక్రమంగా తరలుతున్నట్లు అంచనా. ప్రాసెసింగ్ చేయని వ్యర్థాలను చేపల ఫీడ్‌గా వాడటం వల్ల బ్యాక్టీరియా, టాక్సిన్లు ఫుడ్ చెయిన్‌లోకి చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం అక్రమ రవాణా కాదు, ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన ఫుడ్ సేఫ్టీ సమస్య.

Read More
Next Story