
హైదరాబాద్‌లో ఎబోలా కలకలం | అనాథ పిల్లలకు కొత్త జీవితం
ఫోన్ ట్యాపింగ్ నీడల్లో కోట్ల డబ్బు మిస్టరీ! రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం. రౌండప్
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం. రౌండప్
1) హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ కలకలంతెలంగాణలో ఇప్పటివరకు ఎబోలా నిర్ధారిత కేసులు లేవు. అయితే ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సూడాన్‌కు చెందిన ఓ వ్యక్తికి శంషాబాద్ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్‌లో జ్వరం గుర్తించడంతో గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అనంతరం జ్వరంతో ఉన్న మరో ఇద్దరిని కూడా గాంధీకి రిఫర్ చేశారు. ఈ ముగ్గురు ఒకే అంతర్జాతీయ విమానంలో ప్రయాణించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అధికారులు వైద్య పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
2) అనాథ పిల్లలకు కొత్త జీవితంఅనాథాశ్రమాల్లో ప్రేమ కోసం ఎదురుచూసిన చిన్నారులకు దత్తత రూపంలో కొత్త కుటుంబాలు, కొత్త జీవితాలు దొరుకుతున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రికార్డు స్థాయిలో 307 మంది చిన్నారులు దత్తతకు వెళ్లారు. వీరిలో 277 మందిని దేశీయ దంపతులు దత్తత తీసుకోగా, 30 మంది చిన్నారులు విదేశాల్లో కొత్త కుటుంబాల్లోకి అడుగుపెట్టారు.
3) ఫోన్ ట్యాపింగ్ నీడల్లో కోట్ల డబ్బు మిస్టరీ!కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి అదనపు ఎస్పీ స్థాయికి ఎదిగిన భుజంగరావు ఇంత భారీగా ఆస్తులు ఎలా కూడబెట్టారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు, ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహా పలువురు ఉన్నతాధికారులు నిందితులుగా ఉండటంతో అక్రమాస్తుల వెనుక ఉన్న నెట్‌వర్క్, సహకరించిన వ్యక్తులు, వ్యవస్థ పాత్రపై దర్యాప్తు మరింత కీలకంగా మారింది.

