బీర్ దాహం.. రూ.7,374 కోట్ల ఆదాయం | ఖజానా ఖాళీనా? చేతులెత్తేసిన భట్టి!
x

బీర్ దాహం.. రూ.7,374 కోట్ల ఆదాయం | ఖజానా ఖాళీనా? చేతులెత్తేసిన భట్టి!

డ్రోన్ల ఆట కట్టించే తెలంగాణ బుల్లెట్..!


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం. రౌండ‌ప్‌

1) సమ్మర్ హీట్.. బీర్ ట్రీట్..!

వేసవి వేడితో తెలంగాణలో బీర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ఏప్రిల్, మే నెలల్లోనే 14.22 కోట్ల బీర్ బాటిళ్లు విక్రయమయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. ఈ విక్రయాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల వాటా ఎక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వానికి కూడా రెండు నెలల్లోనే సుమారు రూ.7,394 కోట్ల ఆదాయం లభించింది.

2) డ్రోన్లకు కాలం చెల్లిందా..?

యుద్ధరంగంలో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకోవడం పెద్ద సవాల్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో భారత సైన్యానికి స్వదేశీ పరిష్కారాల కోసం తెలంగాణలోని టి-వర్క్స్ కీలకంగా ముందుకొస్తోంది. వెస్ట్రన్ మిలిటరీ కమాండ్‌తో కలిసి ఆధునిక రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది. యాంటీ-డ్రోన్ టెక్నాలజీ ఇందులో ప్రధాన ఆకర్షణ. డ్రోన్‌ను లక్ష్యంగా చేసుకోవడంలో ఉన్న కష్టాన్ని తగ్గించేందుకు టి-వర్క్స్ ప్రత్యేక బుల్లెట్‌ను రూపొందించింది.

3) తెలంగాణ ఖజానా క్రైసిస్!

ఖజానా ఖాళీనా? ఎమ్మెల్యేల సమావేశంలో నిధుల లేమిపై భట్టి విక్రమార్క వ్యాఖ్యలు కలకలం రేపాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఆందోళన వ్యక్తం చేశారు. హామీల అమలు ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ కూడా అప్పులు, రెవెన్యూ లోటుపై ఆందోళన వ్యక్తం చేసింది.


Read More
Next Story