
డ్రగ్స్ డాన్ నీతూబాయి ఎలా తప్పించుకుంది|₹8 లక్షల చికిత్స ₹2 లక్షల్లోనే
సంపన్నుల స్టేటస్ సింబల్ కోకాపేట...రాళ్ల గుట్టల నుంచి గ్లోబల్ సిటీ వరకు!
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం. రౌండప్‌లో.....
1) డ్రగ్స్ డాన్ నీతూబాయి... ఎలా తప్పించుకుంది?
2) ₹8 లక్షల చికిత్స… ₹2 లక్షల్లోనే!విదేశీ పేషెంట్లకు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్!
3) సంపన్నుల స్టేటస్ సింబల్ కోకాపేటరాళ్ల గుట్టల నుంచి గ్లోబల్ సిటీ వరకు!
1) డ్రగ్స్ డాన్ నీతూబాయి... ఎలా తప్పించుకుంది?
డ్రగ్స్ డాన్‌గా పేరొందిన నీతూబాయి అడ్డాపై ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. నానక్‌రామ్‌గూడ కేంద్రంగా అక్రమ వ్యాపారం సాగిస్తున్న నీతూబాయి వ్యవహారం హైదరాబాద్‌లో మరోసారి సంచలనంగా మారింది. పలుమార్లు కేసులు నమోదైనప్పటికీ ఆమె మళ్లీ గంజాయి దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడుల్లో గంజాయి, నగదు స్వాధీనం కాగా.. ప్రధాన నిందితురాలు నీతూబాయి మాత్రం తప్పించుకుంది. అసలు ఎవరు ఈ నీతూబాయి? ఒక సాధారణ గృహిణి నుంచి గంజాయి మాఫియాలో కీలక వ్యక్తిగా ఎలా మారింది?
2) ₹8 లక్షల చికిత్స… ₹2 లక్షల్లోనే! విదేశీ పేషెంట్లకు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్!
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో విదేశీ రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. నిమ్స్, గాంధీ, ఉస్మానియా, టిమ్స్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు, అంతర్జాతీయ ప్రమాణాల సేవలు ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.6–8 లక్షల ఖర్చయ్యే చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ.2–2.5 లక్షలకే అందేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. టిమ్స్‌లో ప్రత్యేక ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం బ్లాక్ ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. ఈ ప్రణాళికపై ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేసి త్వరలో నివేదిక ఇవ్వనుంది. ప్రభుత్వం ఈ చర్యతో హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
3) సంపన్నుల స్టేటస్ సింబల్ కోకాపేట రాళ్ల గుట్టల నుంచి గ్లోబల్ సిటీ వరకు!
కోకాపేట ఒకప్పుడు రాళ్ల గుట్టల ప్రాంతం. ఇప్పుడు హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన లగ్జరీ ప్లేస్. సంపన్నుల అడ్డాగా మారింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీకి దగ్గరగా ఉండటంతో ఇక్కడ హై-రైజ్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు వేగంగా పెరిగాయి. 2006 వేలాల్లోనే ఎకరం ధర రూ.14 కోట్లకు చేరింది. తర్వాత వంద కోట్ల క్లబ్ దాటి, తాజాగా రూ.237 కోట్ల వరకు చేరింది. హైదరాబాద్–ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్‌లో కోకాపేటను కీలక స్టేషన్‌గా ఎంపిక చేయడం దీని ప్రాధాన్యతను మరింత పెంచింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తర్వాత హైదరాబాద్ కొత్త లగ్జరీ ఐడెంటిటీగా కోకాపేట ఎదుగుతోంది.

