
బీజేపీ 'హిందూత్వ'ను రేవంత్ హైజాక్ చేయగలడా ?
బీజేపీ ట్రంప్ కార్డ్ హిందుత్వను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హైజాక్ చేయాలని చూస్తున్నట్లుంది. ఎందుకంటే దేశంలోని ఇతర ప్రాంతాల్లాగే తెలంగాణలో కూడా హిందుత్వ అజెండాతోనే బీజేపీ పుంజుకుంటోంది. మొదటినుండి తెలంగాణలో కమలంపార్టీ నేతలు హిందుత్వ అజెండాతో పాటు, గోశాలలంటు నానా గోలచేస్తున్న విషయం తెలిసిందే. ఇపుడు అదే పద్దతిలో రేవంత్ కూడా వెళ్ళాలని చూస్తున్నాడా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఎందుకంటే రు. 360 కోట్లతో 250 ఎకరాల్లో మూడు అత్యంతాధునిక గోశాలలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొయినాబాద్, వేములవాడ, యాదాద్రిలో ఈ గోశాలల నిర్మాణానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ మూడుకూడా తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాలే. కేంద్రమంత్రులతో పాటు తెలంగాణలోని కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు ఎంపీలు పైమూడు కేంద్రాల్లో పర్యటిస్తుంటారు. ఇది కాకుండా బాసర, వేములవాడ దేవాలయాలతో పాటు మరో 20 దేవాలయాల అభివృద్ధిపై రేవంత్ దృష్టిపెట్టారు. రేవంత్ తాజా ఆలోచనలు చూస్తుంటే బీజేపీ హిందుత్వ అజెండాను వచ్చే ఎన్నికల నాటికి హైజాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రేవంత్ కొత్తతరహా ప్లాన్ తో బీజేపీకి బ్రేకులు వేయగలరా ?
అయితే దీనికి ఇంకో కోణం కూడా ఉంది . ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బిజెపి కార్డ్ వాడితే అది కాంగ్రెస్ హిందూయేతర వోట్ బ్యాంకుని ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇంకో ప్రశ్న. ఈ అంశం మీద 'పొలిటికల్ పాయింట్' కోసం చేసిన చర్చ.

