‘సర్’ పై కాంగ్రెస్ ‘వార్ రూమ్’
x

‘సర్’ పై కాంగ్రెస్ ‘వార్ రూమ్’

గాంధీభవన్‌లో ప్రత్యేకంగా 'వార్ రూమ్'


సర్ పేరుతో ఓట్లు కోల్పోకుండా అధికార కాంగ్రెస్ అన్నీ చర్యలు తీసుకుంటోంది. ఈనెల 25వ తేదీనుండి ప్రారంభమవుతున్న సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గాంధీభవన్లో ప్రత్యేకంగా ‘వార్ రూమ్’ ఏర్పాటైంది. రాష్ట్రంలోని 3.39 కోట్ల ఓట్లలో ఎన్నికల సంఘం సుమారు 1.15 కోట్ల ఓట్లను ఇంకా మ్యాపింగ్ చేయలేదు. అలాగే మ్యాపింగ్ జరిగిన ఓట్లలో 82 లక్షల ఓట్లలో భారీ అవకతవకలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తంచేసింది. అందుకనే వీళ్ళందరికీ ఎన్నికల సంఘం నోటీసులు జారీచేస్తోంది. ఈ పరిణామాలతో తెలంగాణలో సుమారు కోటి ఓట్లను ఎన్నికల సంఘం సర్ పేరుతో తొలగించబోతున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. అందుకనే జెనూయిన్ ఓట్లను సర్‌లో తొలగించకుండా కాంగ్రెస్ పార్టీ ముందుజాగ్రత్తగా కార్యచరణ ప్రకటించింది.


ఈ కార్యాచరణలో భాగంగా 75మంది మాస్టర్ ట్రైనర్లతో నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇప్పిస్తోంది. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఇప్పటికి 108 నియోజకవర్గాల్లో శిక్షణ పూర్తి చేసింది. మిగిలిన చోట్ల ఈ నెల 20 నాటికి శిక్షణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఓట్లమ్యాపింగ్, అన్‌మ్యాపింగ్ పరిణామాలను నిరంతరం పర్యవేక్షించేందుకు గాంధీభవన్‌లో ప్రత్యేకంగా 'వార్ రూమ్' కూడా ఏర్పాటైంది. సర్ ప్రక్రియలో ఎన్నికలసంఘం సిబ్బంది ఓటర్ల ఇళ్ళకు వెళ్ళినపుడు ట్రైనింగ్ తీసుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా కచ్చితంగా ఉండాలని రేవంత్ ఇప్పటికే ఆదేశించారు. పార్టీకి సంబంధించిన ఓట్లను ఎన్నికల సబ్బంది తొలగించకుండా చూడాలని రేవంత్ చెప్పారు.

ఈనెల 21‌నుండి తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఈ డ్రైవ్ పర్యవేక్షణకు ప్రతి అసెంబ్లీకి ఒక కోఆర్డినేటర్, ప్రతి 10 బూత్‌లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తే అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ లే బాధ్యత వహించాల్సి ఉంటుందని రేవంత్ చెప్పటంతో పార్టీ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది.ఈ అంశం మీద సోషల్ క్రిటిక్ నరోత్తం గారితో చర్చ .

Read More
Next Story