ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ….ప్రజల కోసమా? పొలిటికల్ బ్రాండింగ్ కోసమా?
x

ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ….ప్రజల కోసమా? పొలిటికల్ బ్రాండింగ్ కోసమా?


కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న "ఫ్యూచర్ సిటీ"పై బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు, దానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఘాటు కౌంటర్ తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రధాన చర్చాంశాన్ని లేవనెత్తుతున్నాయి: అసలు "ఫార్మా సిటీ" లేదా "ఫ్యూచర్ సిటీ" అనేవి నిజంగా ప్రజల అభివృద్ధి కోసం, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కోసం నిర్మిస్తున్న ప్రజా ఆస్తులా? లేక కేవలం రాజకీయ మైలేజ్, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు, ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి వాడుకుంటున్న రాజకీయ మైలురాళ్లా? తాము అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేసి తీరుతామన్న హరీష్ రావు హెచ్చరికలకు.. "బీఆర్‌ఎస్ పార్టీలోనే మీ ఫ్యూచర్ ఏంటో మీ మామ, బావమరిది చూసుకుంటున్నారు.. ముందు మీ ఫ్యూచర్ కాపాడుకోండి, ఫ్యూచర్ సిటీని ఆపడం ఎవరితరం కాదు" అంటూ పొంగులేటి వ్యక్తిగత, రాజకీయ విమర్శలతో విరుచుకుపడ్డారు.అసలు ఇవి ప్రజల ప్రయోజనం కోసమా ?లేక పాలకుల సొంత పొలిటికల్ బ్రాండింగ్ కోసం, వందల ఎకరాల భూములపై పట్టు కోసం జనం నెత్తిన రుద్దుతున్న ప్యూర్ పొలిటికల్ , రియల్ ఎస్టేట్ పవర్ గేమా?



Read More
Next Story