
నిరుద్యోగుల కష్టాలు నిజంగా గట్టెక్కినట్టేనా?
జీవో 86 సమర్థనీయమేనా?

తెలంగాణలో 2009 మలిదశ ఉద్యమం, వైఎస్ఆర్ మరణం తర్వాత నోటిఫికేషన్ల తిరస్కరణ, ఆపై BRS హయాంలో వయోపరిమితి పెంచినా పేపర్ లీకులు, కోర్టు కేసుల వల్ల తొమ్మిదిన్నర ఏళ్ళు వృథా కావడంతో నిరుద్యోగుల వయసు పెరిగిందే కానీ ఉద్యోగాలు రాలేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వయోపరిమితిని 34 నుండి 44 ఏళ్లకు పెంచుతూ కేవలం 'ఒక్క ఏడాది' గడువుతో జీవో నెం. 86 జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల ఇప్పుడిప్పుడే పోటీ ప్రపంచంలోకి వస్తున్న ఫ్రెషర్లు, దశాబ్ద కాలంగా ప్రిపేర్ అవుతున్న సీనియర్లతో పోటీ పడాల్సి వచ్చి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందా? అంతేకాకుండా, ఒక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి కావడానికే కనీసం రెండేళ్లు పడుతుంటే, ఈ ఒక్క ఏడాది గడువులోగా రిక్రూట్‌మెంట్ ముగించడం ఆచరణాత్మకంగా సాధ్యమేనా? ఈ ఒక్క సంవత్సర జీవో నిరుద్యోగుల కష్టాలని నిజంగా గట్టెక్కిస్తుందా?

