ఈటెల రాజేందర్ కే క్యాబినెట్ సీట్ దక్కనుందా?
x

ఈటెల రాజేందర్ కే క్యాబినెట్ సీట్ దక్కనుందా?

బండి సంజయ్ ని తొలగిస్తారా ?



త్వరలో జరగబోయే కేంద్ర క్యాబినెట్ విస్తరణపై తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది.ప్రస్తుతం తెలంగాణకున్న 8 మంది ఎంపీలలో సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి పూర్తి స్థాయి క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. తెలంగాణ నుండి మరొకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉండటంతో, పోటీ ఇప్పుడు ఈటల రాజేందర్, డి.కె. అరుణ మధ్యే అన్నట్లుగా మారింది. అయితే, ప్రస్తుతం రేసులో ఈటల రాజేందర్ చాలా ముందున్నారు.


రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి దక్కనప్పుడు, ఈటలకు కేంద్రంలో మంచి పదవి ఇస్తామని బీజేపీ అధిష్ఠానం మాట ఇచ్చినట్లు సమాచారం. ఇది ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. అంతేకాకుండా, తెలంగాణ జనాభాలో బీసీ (వెనుకబడిన తరగతులు) ఓటర్లు 50% పైనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకును ఆకర్షించడం బీజేపీకి చాలా ముఖ్యం. ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్‌తో పాటు, మరో బలమైన బీసీ నాయకుడిని క్యాబినెట్‌లోకి తీసుకోవాలని అనుకుంటే, దానికి ఈటల రాజేందరే సరైన ఛాయిస్ అని అధిష్టానం భావిస్తుందని బిజెపి నాయకులు సుందరయ్య గారు ఫెడరల్ తెలంగాణాతో చెప్పారు.

మరోవైపు, మహిళా కోటాలో డి.కె. అరుణ పేరు వినిపిస్తున్నప్పటికీ, ఆమెకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుండి దగ్గుబాటి పురందేశ్వరి రేసులో ఉన్నారు. జాతీయ స్థాయిలో పురందేశ్వరికి మంచి గుర్తింపు, అలాగే గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నాయి. ఒకవేళ తెలుగు రాష్ట్రాల నుండి మహిళా కోటాలో ఒకరికే ఛాన్స్ ఇవ్వాలనుకుంటే, సీనియారిటీ పరంగా పురందేశ్వరికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల డి.కె. అరుణకు ఛాన్సులు తగ్గి, ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని బిజెపి నాయకులు సుందరయ్య ఫెడరల్ తెలంగాణాతో ఇంటర్వ్యూ లో చెప్పారు.



Read More
Next Story