బిజెపిది ‘ఓట్ల’ యాత్రేనా?
x

బిజెపిది ‘ఓట్ల’ యాత్రేనా?


రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలు తెలుసుకునేందుకు బిజెపి మూడు రోజుల యాత్ర ప్రారంభించింది. ఇప్పటివరకు బీజేపీ ప్రధానంగా పట్టణ ప్రాంతాలు, యువత, వ్యాపార వర్గాలు, ఉత్తర తెలంగాణలోని కొన్ని సామాజిక వర్గాలలో మాత్రమే బలంగా ఉందనే ముద్ర ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగ ఓటు బ్యాంకును ఆకర్షించడంలో ఆ పార్టీ ఎప్పుడూ వెనుకబడే ఉంది.ఇప్పుడు గజ్వేల్, జనగామ, వరంగల్, పెద్దపల్లి వంటి పక్కా వ్యవసాయ ఆధారిత ప్రాంతాల గుండా సాగుతున్న ఈ యాత్ర ద్వారా ‘బీజేపీ పట్టణ పార్టీ’ అనే ముద్రను తొలగించుకుని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తన సత్తా చాటగలదా ? కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై ఉన్న రైతు వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని,రైతుల్లో కూడా బిజెపి పట్ల సానుకులతను కలిగించగలదా?



Read More
Next Story