మీ పిల్లల స్కూల్ బస్సు సేఫ్‌నా..?
x

మీ పిల్లల స్కూల్ బస్సు సేఫ్‌నా..?


ర‌చ్చా-రాజ‌కీయం @ 5 పి.ఎం.కు స్వాగ‌తం.

1) మీ పిల్లల స్కూల్ బస్సు సేఫ్‌నా..?కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు తెలంగాణ ప్రభుత్వం స్కూల్ బస్సుల భద్రతపై కఠిన చర్యలు చేపట్టింది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, అర్హత కలిగిన డ్రైవర్లు, ఓవర్‌లోడింగ్ నియంత్రణ వంటి నిబంధనలను తప్పనిసరి చేస్తూ విద్యా శాఖ డైరెక్టర్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన తనిఖీల్లో వేల సంఖ్యలో స్కూల్ బస్సుల్లో సురక్షా లోపాలు బయటపడటం, 1,800కి పైగా బస్సులు ఫిట్‌నెస్ లేకుండా నడుస్తున్నట్లు గుర్తించారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో చోటుచేసుకున్న స్కూల్ బస్సు ప్రమాదాలు ఈ సమస్య తీవ్రతను మరింత స్పష్టం చేస్తున్నాయి. స్కూల్ బస్సుల సేఫ్టీలో లోపాలు ఎందుకు కొనసాగుతున్నాయి? తనిఖీల్లో బయటపడిన నిజం ఏమిటి?

2) తెలంగాణలో పాల కొరత!తెలంగాణలో రోజుకు సుమారు 160–170 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ రాష్ట్ర డిమాండ్ మాత్రం 165–180 లక్షల లీటర్ల వరకు ఉండటంతో రోజుకు సుమారు 5–10 లక్షల లీటర్ల లోటు కొనసాగుతోంది. ఈ లోటును తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి పాలు సరఫరా అవుతున్నాయి. జూన్ 1, ప్రపంచ పాల దినోత్సవం వేళ… తెలంగాణ డెయిరీ రంగం నిజంగా ఎక్కడ నిలబడి ఉంది? రాష్ట్రం ఇంకా self-sufficient ఎందుకు కాలేకపోతోంది? పరిష్కారం పశువుల సంఖ్య పెంచడంలో ఉందా? లేక ఒక్క పశువు ఇచ్చే పాల ఉత్పాదకతను పెంచడంలోనా?

3) TIMS వద్ద టెన్షన్! మార్చురీపై రగడTIMS ఆసుపత్రి మోర్చరీని వెంగళరావు నగర్ సమీప రోడ్ సైడ్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్‌లు, మృతదేహాల రవాణా కారణంగా రోజువారీ ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ మోర్చరీ స్థలాన్ని మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, TIMS ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్న ప్రతిష్టాత్మక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా, ఆధునిక వైద్య సదుపాయాలతో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంటోంది.

Read More
Next Story