
మూసి ప్రాంతంలో 'నైట్ ఎకానమీ' దేని కోసం?
మూసీనది సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘నైట్ ఎకానమి’ కాన్సెప్టుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. రేవంత్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మూసీనది సుందరీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ‘క్యూర్ బిల్లు’లో మూసి ప్రాంతంలో నైట్ ఎకానమీకి చట్టబద్దత కల్పించారు. నైట్ ఎకానమీలో రెస్టారెంట్లు, హోటల్లు, దుకాణాలు, షాపింగ్ సెంటర్స్, వినోద సంస్థలు, బార్లు, పబ్‌లు ఇక్కడ రాత్రులంతా వ్యాపార నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు సమస్య ఏమిటంటే ప్రస్తుతం మూసీనది కేంద్రంగా వ్యాపారాలు చేసుకుంటున్న వారందిరినీ ప్రభుత్వం ఖాళీచేయించబోతోంది. వేలాదిమంది చిరువ్యాపారులను ఖాళీచేయించి డెవలప్ చేయబోయే ప్రాంతంలో కార్పొరేట్ సంస్ధలు, బడావ్యాపారులకు భూములు కేటాయించబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది.
ప్రభుత్వ లెక్క ప్రకారం నదికి రెండువైపులా ఇళ్ళను, వ్యాపారస్తులను ఖాళీచేయిస్తే ప్రభుత్వానికి సుమారు 25 వేల ఎకరాల స్ధలం దొరుకుతుంది. ఇపుడు వ్యాపారాలు చేసుకుంటున్నవారిని ఖాళీచేయిస్తే మళ్ళీ వారికి ఇక్కడ వ్యాపారాలు చేసుకోవటానికి ఎలాంటి అవకాశాలు ఉండవు అనేప్రచారం పెరిగిపోతోంది. రేవంత్ ఏమో మూసీనది సుందీరకరణ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ కూడా దుబాయి ,సింగపూర్ లాగా మారుతుందని చెబుతున్నాడు.

