జన్వాడ స్కూల్లో రోబోటిక్ టీచర్లు
x

జన్వాడ స్కూల్లో రోబోటిక్ టీచర్లు


ప్రభుత్వ పాఠశాలల పట్ల రేవంత్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. తాజాగా ఆయన ‘తెలంగాణా పబ్లిక్ స్కూల్’ని ఆరూర్ గ్రామంలో ప్రారంభించారు.అన్ని వసతులు విద్యార్థులకు ఉండేలా దీన్ని రేవంత్ ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకువచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ విద్యా రంగాన్ని ఇంకా బలోపేతం చేయడానికి,అలాగే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ రేవంత్ ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ జిల్లా పరిషత్ పాఠశాలను దత్తత తీసుకుని,దాన్ని ఒక మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దేందుకు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందుకు వచ్చింది. తాజాగా దీనికోసం ఈ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖకి,ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒప్పందం కుదుర్చుకుంది.


‘ ఇప్పటికే ఈ స్కూల్ లో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం 15 గదులు ,6 టాయ్లెట్లు నిర్మించారని, వీటిల్లో 3 గదులు రోబోటిక్ టీచింగ్ పరికరాలు,ఆ విభాగం కోసమే వాడబోతున్నారని, త్వరలో ఇంకో 45 గదులు నిర్మిస్తున్నారని జన్వాడ స్కూల్ హెడ్ మాస్టర్ దైవాదీనం రెడ్డి ఫెడరల్ తో చెప్పారు. కొంతకాలంగా ప్రతి శనివారం 8,9 తరగతుల విద్యార్థులకి ఏఐ క్లాసెస్ బోదిస్తున్నారని కూడా చెప్పారు.బెంగుళూరులోని ఇండస్ స్కూలు నుండి హైదరాబాద్ లోని స్కూలుకు ఈనెల 31వ తేదీన 3 హ్యూమనాయిడ్ రోబోస్ అందుతాయి. 6-10 తరగతుల విద్యార్ధులకు అన్నీ సబ్జెక్టులను టీచ్ చేస్తాయని ముట్లూరి శామ్యూల్ జోసెఫ్ తెలంగాణ ఫెడరల్ కు తెలిపారు.

ఈ రోబోటిక్ టీచర్స్ ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక, అంతర్జాతీయ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం ద్వారా డిజిటల్ బోధన అందుబాటులోకీ వస్తుందనీ ప్రభుత్వం భావిస్తున్న.. దీని వలన విద్యార్థులకు కలిగే నష్టాలను కూడ ముందే అంచనా వెయ్యకపోతే విద్యార్థులు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నుండి పల్లె నాగరాజు ఫెడరల్ తో చెప్పారు.


Read More
Next Story