నెలకు 3 నోటిఫికేషన్లు! TGPSC కొత్త రూల్స్‌..
x

నెలకు 3 నోటిఫికేషన్లు! TGPSC కొత్త రూల్స్‌..


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం. రౌండ‌ప్‌లో

1) నెలకు 3 నోటిఫికేషన్లు! TGPSC కొత్త రూల్స్‌..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఉద్యోగ నియామకాల్లో కీలక మార్పులు చేపట్టింది. ప్రతి నెల మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ, సుమారు 3,800 ఖాళీల భర్తీకి ప్రణాళిక రూపొందించింది. మొత్తం నియామక ప్రక్రియను ఏడాదిలోపే పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని పరీక్షలను CBRT (Computer Based Recruitment Test) విధానంలో నిర్వహిస్తూ పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది.

2) తెలంగాణలో మళ్లీ పాత నినాదం…

కొత్త దుమారం!హైదరాబాద్ రాజకీయాల్లో మళ్లీ ప్రాంతీయ సెంటిమెంట్ తెరపైకి వస్తోంది. ఏపీ నేతల వ్యాఖ్యలను తెలంగాణ ఆత్మగౌరవ అంశంగా మలిచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. రేవంత్ ప్రభుత్వంపై ‘ఏపీ అనుకూల’ ముద్ర వేయడమే ఈ వ్యూహం లక్ష్యమని ఆయన విశ్లేషించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు లక్ష్యంగా సాగుతున్న రాజకీయ విమర్శలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వరకు మరింత ముదిరే అవకాశం ఉందన్నారు. అయితే దశాబ్దం క్రితం మాదిరిగా ప్రాంతీయ సెంటిమెంట్ ఇప్పుడు ఎంతవరకు పనిచేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

3) గ్లోబరీనా నుంచి కోఎంప్ట్ వరకు…అదే వివాదం!

సీబీఎస్ఈ ఓఎస్ఎం (ఆన్‌లైన్ స్క్రీనింగ్ & మూల్యాంకన) కాంట్రాక్టును నిర్వహిస్తున్న కోఎంప్ట్ ఎడ్యుటెక్ సంస్థపై మరోసారి వివాదం చెలరేగింది. 12వ తరగతి పరీక్షల జవాబుపత్రాల స్కానింగ్, అప్‌లోడ్ ప్రక్రియలో తారుమార్లు జరిగినట్లు ఆరోపణలు రావడంతో 18 లక్షల మందికిపైగా విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.ఈ సంస్థ గతంలో గ్లోబరేనా టెక్నాలజీస్ పేరుతో పనిచేసి, 2019 తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదంలోనూ విమర్శలు ఎదుర్కొంది. ఆ ఏడాది 9.7 లక్షల మంది విద్యార్థుల్లో 3.8 లక్షల మందికి పైగా ఫెయిల్ కావడంతో తీవ్ర నిరసనలు చెలరేగాయి. అనంతరం సంస్థ తన పేరును కోఎంప్ట్ ఎడ్యుటెక్‌గా మార్చుకుంది.


Read More
Next Story