టిఆర్ఎస్ కి రాజకీయ భవిష్యత్తు లేదు
x

' 'టిఆర్ఎస్' కి రాజకీయ భవిష్యత్తు లేదు'

జిహెచ్ ఎం సి ఎన్నికలే టిఆర్ ఎస్ భవిష్యత్తుని నిర్ణయిస్తాయా?


కల్వకుంట్ల కవిత టిఆర్ ఎస్ పార్టీని ప్రకటించిన నాటి నుండి చురుగ్గా పాదయాత్రలు,పర్యటనలు చేస్తూ తెలంగాణా ప్రజల దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నారు.సింగరేణి కార్మికుల సమస్యల సాధన కోసం 'బాయిబాట' కార్యక్రమం చేసారు.మొయినాబాద్‌లో బహిరంగ సభలో జీఓ 111 వల్ల ఇబ్బంది పడుతున్న 120 గ్రామాల ప్రజలకు మద్దతుగా మాట్లాడారు. జూలై 2వ తేదీన ఉప్పల్ భగాయత్‌లో బస్తీ నివాసుల ఇండ్ల పట్టాల కోసం భారీ భూపోరాట సభను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. తాము జిహేచ్ ఎం సి ఎన్నికల్లో పోటి చేస్తామని,రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని కూడా గట్టిగా చెప్పారు.


టిఆర్ ఎస్ పార్టీ లక్ష్యాన్ని,ప్రజల కోసం ఏం చేయబోతుందో చెప్తూ పేద ప్రజల హక్కుల కోసం నేరుగా అసెంబ్లీలో గొంతుక వినిపించడమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. తెలంగాణలో ఒకటి నుండి ఏడో తరగతి వరకు చదివిన వారినే ఇక్కడి స్థానికులుగా గుర్తించాలనే డిమాండ్‌ను బలంగా వినిపిస్తూ, దీనికి విరుద్ధంగా వచ్చిన హైకోర్టు తీర్పుపై లీగల్ ఫైట్ చేయడమే తమ ప్రథమ కర్తవ్యంగా కవిత ప్రకటించారు. దీనితో పాటు, దశాబ్దాలుగా ఎంఎస్ మక్తా వంటి బస్తీల్లో నివసిస్తున్న పేద ప్రజలకు ఇండ్ల పట్టాల సాధన కోసం జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో భారీ భూపోరాటం చేపట్టనున్నారు. మహిళా సాధికారత, బస్తీ వాసుల ఆత్మగౌరవ రక్షణే లక్ష్యంగా సాగుతున్న ఈ పొలిటికల్ ఎజెండాతో హైదరాబాద్ నగర ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు తెలంగాణ రక్షణ సేన దూసుకుపోతోంది.

బస్తీ వాసులకు ఇండ్ల పట్టాల పంపిణీ, సింగరేణి కార్మికుల కోసం 'బాయిబాట' కార్యక్రమం, స్థానిక ఉద్యోగాల కోసం లీగల్ ఫైట్ వంటి ప్రజాపోరాటాల ద్వారా జనాల్లో మైలేజీ సంపాదించుకుని ఎన్నికల్లో లబ్దిపొందాలని కవిత ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల్లో సాధించే ఫలితాలపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడుంది. ఈ నేపధ్యంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీకి కవిత పార్టీ ప్రత్యామ్నాయం కాగలదా ?

Read More
Next Story