
డీఎంకేతో మా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయంటే?
జననాయగన్ సినిమా స్పందించి, పరాశక్తి విషయంలో స్పందించకపోవడానికి కారణమేమిటో వివరించిన కాంగ్రెస్ నేత
తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం జోరందుకుంది. పార్టీలన్నీ ఎత్తులు,పొత్తులు, రాజకీయ సమీకరణాలపై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తమిళనాడు ఏఐసీసీ ఇన్ ఛార్జ్ గిరీష్ చోడంకర్ ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు.
కూటమి సమన్వయం, సంస్థాగత క్రమ శిక్షణ, ప్రచార వ్యూహాం, నాయకత్వం పునరుద్దరణ వంటి అంశాలపై ఇంటర్వ్యూ లో ప్రశ్నలు రాగా ఆయన సమాధానమిచ్చారు.
కాంగ్రెస్, డీఎంకే మధ్య సంబంధం బలంగానే ఉందా?
చాలా బలంగా ఉంది. సంబంధం బలహీనపడిందనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మేము డిసెంబర్ 3న గౌరనీయులైన ముఖ్యమంత్రిని కలిశాము. ఆయన మమ్మల్ని స్వాగతించారు.
ఇటీవల మీరు తమిళనాడుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు? ఏం చర్చించారు?
నాయకులు తమ మనస్సులోని మాటలు, అభిప్రాయాలు బహిరంగంగా నాయకత్వాన్ని తెలియజేస్తారు. నాయకత్వం వాటిని విన్నది. అందరికి మాట్లాడే అవకాశం లభించింది.
నాయకులంతా ఐక్యంగా ఉండాలని, బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని ఏఐసీసీ ఆదేశించింది. బీజేపీ నాయకులు దీనిని విమర్శించారు. ఇది కాంగ్రెస్ పార్టీలోని క్రమశిక్షణ లోపమని అంటోంది? మీరు ఎలా స్పందిస్తారు?
ఇక్కడ ఈడీ, సీబీఐలను ఉపయోగించి పొత్తు పెట్టుకోవడం లేదు. ఎవరూ ఎవరిని బ్లాక్ మెయిల్ చేయడం లేదు. వారు ప్రతిదీ పాయింట్ బ్లాంక్ రేంజ్ లో పనిచేయించుకుంటున్నారు.
ఈడీ, సీబీఐని ఉపయోగించి అరెస్ట్ చేయడం, ప్రజలను అరెస్ట్ చేసి వేధించడం ద్వారా వారు ఎన్నికలు నడుపుతున్నారు. మేము అలా చేయడం లేదు. బీజేపీ దేశాన్ని విభజించింది.
స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కూడా ఇదే చేసింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడూ వారు బ్రిటిష్ వారితో కుమ్మక్కు అయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని విభజించారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4.29 శాతం ఓట్లతో 18 సీట్లను సాధించింది. ఈసారి డీఎంకేతో ఏం బేరసారాలు చేస్తున్నారు?
అదే మా వ్యూహం. అది ఏంటో నేను మీతో చెప్పలేను. కానీ ప్రతిదీ సీనియర్ నాయకులతో చర్చిస్తున్నాం. వారు నిర్ణయం తీసుకుంటారు.
నటుడు విజయ్ ను మీ కూటమిలోకి తీసుకుంటున్నారా? మీ పార్టీ కూడా జననాయగన్ సెన్సార్ షిప్ కు వ్యతిరేకంగా మాట్లాడింది. కాంగ్రెస్ ఎందుకు ఆ వైఖరి తీసుకుంది?
రాహుల్ గాంధీ కొత్త యాత్రను ప్రారంభించారు. ఇది నయా న్యాయాన్ని తీసుకొస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కాంగ్రెస్ ఉండి పోరాడుతుంది. వారు ఎవరో ఏంటో చూడము. అన్యాయం జరిగితే మేము వ్యతిరేకిస్తాం. మేము న్యాయం వైపు నిలబడతాం.
పరాశక్తి విషయంలో ఇదే సమస్య ఎదురయింది. అప్పుడేందుకు ఇలా స్పందించలేదు?
ఆ సినిమాలో కల్పన ఉందా లేదా చరిత్ర ఉందా చూడాలి. దానికి చాలా సమస్యలు ఉన్నాయి. కల్పనను చరిత్రగా ప్రదర్శించినప్పుడూ వక్రీకరణ జరుగుతుంది. అది మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన సమయం.
మీ పార్టీ ఆన్ లైన్ ప్రచారం, రక్కంబా టాక్ అందరిని ఆకర్షిస్తోంది. ఆ ఆలోచన ఎలా వచ్చింది?
పుదుచ్చేరి, తమిళనాడు కోసం కొత్త ఎన్నికల వ్యూహకర్తను నియమించం. పుదుచ్చేరిలో ఇది బాగా వైరల్ అయింది. దానికి మేము సంతోషంగా ఉన్నాము. ఇది ప్రతిరోజు స్థానిక సమస్యలను లేవనెత్తుంది. ఆ రోజు రక్కంబ ఏం చెప్తుందో వినడానికి ప్రజలు సాయంత్రం ఏడు గంటల నుంచి వేచిచూస్తున్నారు. ఇప్పుడు తమిళనాడులో ఇదే జరుగుతుంది.
తమిళనాడులోని జిల్లా స్థాయి కాంగ్రెస్ నాయకులలో 61 శాతం మంది 50 ఏళ్ల లోపు వారే అని మీరు ఇటీవల ప్రకటించారు. ఈ నిర్ణయం చాలా ఆలస్యంగా తీసుకున్నారా?
ఏదీ ఆలస్యంగా చేయలేదు. ఏ సమయమైన ఒక ప్రారంభం ఉంటుంది. సోషల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే మేము కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ముగించారు.
Next Story


