ట్రైనీ ఐపిఎస్  ఉదయ్ కృష్ణారెడ్డి  ఆత్మహత్యా యత్నం   సింపతీ డ్రామానా?
x

ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యా యత్నం సింపతీ డ్రామానా?


ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు ఆయనపై లైంగిక వేధింపులు, బెదిరింపులు , ఐటీ యాక్ట్ కింద తీవ్రమైన సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడి నివాసంలో అచేతనంగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయనను ఎ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.


తొలుత ఉదయ్ కృష్ణారెడ్డి శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనే వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, చికిత్స అందించిన వైద్యులు విచారణలో అసలు విషయాన్ని స్పష్టం చేశారు. ఆయన రక్తపరీక్షల నివేదికల్లో ఎలాంటి విష పదార్థాలు లభించలేదని, కేవలం అధిక మొత్తంలో మద్యం సేవించడం వల్లే స్పృహ తప్పి పడిపోయారని వైద్యులు తెలిపారు. స్టమక్ వాష్ చేసిన అనంతరం ఆయన కోలుకున్నారని వైద్య బృందం వెల్లడించింది. అయితే ఆత్మహత్యాయత్నానికి ముందే ఆయన రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖ వెలుగులోకి రాగా, అందులో సదరు మహిళా అధికారితో తనకు ఏడాదిగా సన్నిహిత సంబంధం ఉందనే విషయాలను ప్రస్తావించినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఈ కేసు పరిణామాలపై పోలీసులు విస్తృతస్థాయి విచారణను వేగవంతం చేశారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, న్యాయస్థానాలు మరియు చట్టపరమైన ప్రక్రియపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఉదయ్ కృష్ణారెడ్డి అంతకుముందే స్పష్టం చేశారు. పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ నివేదికలు, అత్తాపూర్ పిఎస్ కేసు పురోగతి మరియు ఆస్పత్రి వైద్యుల మెడికో-లీగల్ నివేదికల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నారు.

Read More
Next Story