
బొగ్గు మింగిందెవరు?
సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం!
సింగరేణి అధికారిక రికార్డుల్లో నమోదైన సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సంస్థ వెబ్‌సైట్‌లో ఏడు గనుల వద్ద భారీగా బొగ్గు స్టాక్ ఉన్నట్లు నమోదై ఉండగా, కోల్ స్టాక్ పాయింట్ల వద్ద ఆ నిల్వలు కనిపించడం లేదన్న ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వ్యత్యాసంపై ప్రశ్నలు తలెత్తడంతో, బొగ్గు నిల్వల లెక్కలు మరియు వాస్తవ పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలికితీయాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
Next Story

