
అవినీతి రహిత పాలననే మాటపై ‘టీవీకే’ నిలబడుతుందా?
అవినీతిరహిత పాలనే కాదు.. ఇంతకుముందు అవినీతి కేసులను విచారించాలంటున్న ప్రజలు
తమిళనాడులో చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం(టీవీకే) ప్రభుత్వం భారీ ప్రజాధనాన్ని నిర్వహించే శాఖల విషయంలో ఇప్పటికే ప్రశంసలు పొందుతున్నాయి. ఏ పనిలో కూడా ఎలాంటి కమిషన్లు లేకుండా నిర్వహిస్తోందని ఇప్పటికే నివేదికలు వస్తున్నాయి. కానీ పెండింగ్ లో ఉన్న అవినీతి కేసులపై ఇంకా ఎంత త్వరగా చర్యలు తీసుకుంటుదనే దానిపై ప్రశ్నలు మిగిలి ఉన్నాయి.
ప్రజా పనులు, రహదారుల నుంచి టాస్మాక్, సీఎండీఏ సంబంధిత సమస్యల వరకు, అనేక పాత కేసులపై తక్షణ విచారణ జరగాలని ప్రజలు అంటున్నారు. ఈ కేసులను ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందనే దానిపైనే దాని అవినీతి వ్యతిరేక ప్రతిష్ట ఆధారపడి ఉంటుందని వారు వాదిస్తున్నారు.
దశాబ్దాలుగా, తమిళనాడులోని ప్రభుత్వ ప్రాజెక్టులు కమీషన్ వ్యవస్థతో ముడిపడి ఉన్నాయని, గత ప్రభుత్వాలు 20% నుంచి 40% వరకు కమీషన్లు డిమాండ్ చేశాయని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారని వర్గాలు పేర్కొంటున్నాయి.
టెండర్లు..
కొత్త ప్రభుత్వం టెండర్ ప్రక్రియలో మార్పులు తీసుకువచ్చిందని, పార్టీ కార్యకర్తలు ఇకపై కమీషన్లు డిమాండ్ చేయడం లేదని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. భూ లావాదేవీలు లేదా అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం అక్రమ చెల్లింపులు కోరలేదని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా చెబుతున్న మాట. అయితే ఈ విషయంలో బలమైన ఖండనలు కూడా ఉన్నాయి.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఏఐఏడీఎంకే మంత్రులు సి. విజయభాస్కర్, ఎస్.పి. వేలుమణిలను పార్టీలోకి తీసుకోకూడదని టీవీకే తీసుకున్న నిర్ణయం, దాని స్వచ్ఛమైన పాలన ప్రతిష్టను బలోపేతం చేయడానికి సాయపడిందనేది నిర్వివాద అంశం.
అయితే, కేవలం ప్రతిష్టను పెంచుకోవడం మాత్రమే సరిపోదని, పెండింగ్‌లో ఉన్న దర్యాప్తులు వేగంగా ముందుకు సాగాలని ప్రజలు చెబుతున్నారు. అరప్పోర్ ఇయక్కంకు చెందిన అవినీతి వ్యతిరేక కార్యకర్త జైరామ్ వెంకటేశన్ పలు ఫిర్యాదులు సమర్పించి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
"ఇది ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు జరగాలి, వారు వెంటనే నిర్మాణాన్ని నిలిపివేయాలి." పెండింగ్‌లో ఉన్న కేసులు వివాదాస్పద రామ్సర్ బ్రిగేడ్ ప్రాజెక్ట్, రేషన్ రవాణా కాంట్రాక్టులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, మైనింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులలో జరిగిన అవకతవకలపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రులపై పెండింగ్‌లో ఉన్న కేసులను, ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనప్పటికీ ఛార్జిషీట్లు దాఖలు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని కూడా వారు ఎత్తి చూపారు. రహదారుల విషయానికొస్తే, ఫెంగల్ తుఫాను తర్వాత వంతెన కూలిపోవడాన్ని కార్యకర్తలు ప్రస్తావిస్తూ, నిర్మాణ నాణ్యత సమస్యలపై జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేశారు.
కేపీ పార్క్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలను కూడా వారు ప్రముఖంగా ప్రస్తావించారు, ఇక్కడ నిర్మాణ ప్రమాణాలపై ఫిర్యాదులు దాఖలయ్యాయి.
సంస్థాగత సంస్కరణలు..
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి సాధారణ సమ్మతిని పునరుద్ధరించడం ద్వారా ఆర్థిక నేరాల దర్యాప్తు కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో సమన్వయాన్ని మెరుగుపరచడం ద్వారా ప్రభుత్వం దర్యాప్తు యంత్రాంగాలను బలోపేతం చేయాలని కార్యకర్తలు అంటున్నారు.
అవినీతి కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండకుండా చూసుకోవడానికి బలమైన సంస్థలు అవసరమని వారు వాదిస్తున్నారు. గత రాజకీయ పద్ధతుల నుంచి దూరం కావడానికి ప్రయత్నించినందుకు టీవీకే ప్రభుత్వం సానుకూల ప్రజాభిప్రాయాన్ని పొందింది. కానీ దాని అవినీతి వ్యతిరేక వాగ్దానాన్ని కొలవగల చర్యగా మార్చగలదా లేదా అనే పెద్ద సవాలు ముందుంది.
Next Story

