బీజేపీకి జెన్-జీ దెబ్బ.. బంకీపూర్‌లో ఓటమి..!
x

బీజేపీకి జెన్-జీ దెబ్బ.. బంకీపూర్‌లో ఓటమి..!

బీజేపీ కంచుకోటగా పేరున్న నియోజకవర్గంలో ఉపఎన్నిక ఫలితం ఆసక్తి రేపింది. జన్ సురాజ్ పార్టీకి అధినేత ప్రశాంత్ కిషోర్ విజయం.


బీజేపీకి జెన్‌-జీ మరో భారీ షాక్ ఇచ్చింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత.. ఇప్పుడు బీహార్‌లో బీజేపీని ఓడించడంలో యువత కీలక పాత్ర పోషించారు. బీహార్‌లోని బింకీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. ఇంతకాలం ఈ నియోజకవర్గం బీజేపీ కంచుకోటగా నిలిచింది. 1995 నుంచి ఈ నియోజకవర్గంలో కమలం పార్టీ తప్ప మరే ఇతర పార్టీ గెలవకపోవడం ఇందుకు నిదర్శనం. అయితే ఈసారి మాత్రం చరిత్ర మారింది.. కంచుకోటలోనే బీజేపీని ఓడించింది యువత. ఈ ఉపఎన్నికలో ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంక్ కిషోర్‌ విజయం సాధించారు. సమీప అభ్యర్థి బీజేపీ నేత నీరజ్ కుమార్‌ సిన్హాపై 19,419 ఓట్ల ఆధిక్యంలో పీకే ఉన్నారు. ఇంకా మూడు రౌండ్లే మిగిలి ఉండటంతో పీకే విజయం ఖరారయిపోయింది. అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది.

అయితే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్ నబీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ కారణంగానే ఇక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికతోనే ప్రశాంత్ కిషోర్ తొలిసారి ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారు. తొలి ఎన్నికలోనే తమ పార్టీ విజయం దాదాపు ఖరారు కావడంతో జన్ సురాజ్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

అయితే ఈ ఉపఎన్నికలో బీజేపీ ఓటమిలో యువత కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. బంకీపూర్‌లో మొత్తం 3 లక్షల 79 వేల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 2లక్షలు కాగా, మహిళలు 1 లక్ష 79 వేల మంది ఉన్నారు. వీరి మొత్తంలో యువత 33శాతం వరకు ఉన్నారు. అంటే 1.2 లక్షల మంది యువతే అన్నమాట. దీంతో ఈ ఉపఎన్నిక ఫలితాలను లిఖించడంలో యువత కీలకంగా మారింది. నీట్ పేపర్ లీక్, సీజేపీ ఆందోళనలు సమయంలో ప్రభుత్వ వైఖరితో యువతలో బీజేపీపై ఆగ్రహం తీవ్రంగా పెరిగిందని, అందుకు ఈ ఉపఎన్నిక నిదర్శనంగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రశాంక్ కిషోర్ తన జన్ సురాజ్ పార్టీని స్థాపించిన తర్వాత ఇదే తొలి విజయం కానుంది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎస్‌పీ పోటీ చేసింది. మొత్తం 243 స్థానాలు ఉండగా వాటిలో 238 స్థానాల్లో పీకే పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. కానీ ఒక్క స్థానంలో కూడా విజయం అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఉపఎన్నికలో జేఎస్‌పీ వ్యవస్థాపకుడు ప్రశాంక్ కిషోర్ బరిలో నిలిచారు. ఇందులో తమ పార్టీ తొలి విజయాన్ని కూడా ఆయన అందుకున్నారు.

Read More
Next Story