ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన అర్జెంటీనా
x
విజయం సాధించిన ఆనందంలో అర్జెంటీనా ఆటగాళ్లు

ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన అర్జెంటీనా

వరుసగా మూడో సారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ కు దూసుకెళ్లిన మెస్సీ సేన


Click the Play button to hear this message in audio format

ఫుట్ బాల్ ప్రపంచకప్ లో వరసుగా మూడోసారి అర్జెంటీనా ఫైనల్ కు దూసుకెళ్లింది. గత ప్రపంచకప్ లో ట్రోఫిని ముద్దాడిన ఈ జట్టు వరుసగా రెండోసారి కప్ సాధించాలనే కలను సాకారం చేసుకోవడానికి ఒక అడుగు దూరంలో నిలిచింది.

ఆటలో ఆది నుంచి ఆధిపత్యం వహించిన ఇంగ్లాండ్ 85 నిమిషం వరకూ 1-0 తో ఆధిక్యంలో ఉంది. అయితే ఆట మరో 15 నిమిషాల్లో ముగుస్తుందనగా, ఎంజో ఫెర్నాంజెజ్, సబ్ ట్యూట్ ఆటగాడు లౌటారో మార్టినెజ్ చిరుతలా కదిలి వరుసగా రెండు గోల్స్ చేయడంతో అర్జెంటీనియన్స్ సంబరాల్లో మునిగిపోయారు.

దీనితో ఇంగ్లాండ్ ఆటగాళ్లు మైదానంలో కుప్పకూలిపోయారు. ప్రపంచకప్ లో అర్జెంటీనా ఇప్పటికీ మూడుసార్లు ఇంగ్లాండ్ ను ఓడించింది. చివరిగా రెండు జట్లు 1998 లో తలపడ్డాయి. తమ పరాజయం పై ఇంగ్లండ్ కెప్టెప్ హ్యారీకేన్ స్పందించాడు.

తమ శక్తినంత పాదాలకు ధారపోసి తలపడ్డామని కానీ విజయం సాధించలేకపోయామని అన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన అర్జెంటీనా ఆదివారం న్యూజెర్సీలోని ఈస్ట్ రూథర్ ఫోర్డ్ లోని జరిగే ఫైనల్ మ్యాచ్ లో యూరోపియన్ ఛాంపియన్ అయిన స్పెయిన్ తో తలపడతారు.

ఆట ప్రారంభం నుంచి ఇరుజట్లు ఆటగాళ్లు పదేపదే గోల్ పోస్ట్ లపై దాడులు చేసినప్పటికీ గోల్ గా మలచలేకపోయారు. అయితే ఆట 55 నిమిషంలో ఇంగ్లండ్ మిడ్ ఫీల్డర్ ఆంథోని గోర్డాన్ గోల్ సాధించి తన జట్టును ఆధిక్యంలో పంపాడు.
ఆట చివరి వరకూ ఇంగ్లాండ్ దీనిని కాపాడుకుంటూ వచ్చింది. అయితే ఆట 85 వ నిమిషంలో బాక్స్ వెలుపల నుంచి పాస్ అందుకున్న ఫెర్నాండెజ్ దానిని గోల్ గా మలిచి ఆధిక్యాన్ని సమం చేశాడు. కాసేపటి మెస్సి మ్యాజిక్ చేస్తూ మార్జినెజ్ కు పాస్ అందించగా, అతను దానిని హెడర్ తో గోల్ గా మలిచి విజయాన్ని ఖాయం చేశాడు.
Read More
Next Story