యువ క్రికెటర్ పై రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐ
x

యువ క్రికెటర్ పై రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐ

పలుమార్లు పుట్టిన తేదీ మార్చుకున్న లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్


Click the Play button to hear this message in audio format

వయస్సు విషయంలో బీసీసీఐని మోసం చేసినందుకు బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్ ను ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ నుంచి తప్పించింది. రాజ్ కోట్, అహ్మదాబాద్ వేదికగా జరగనున్న అండర్ -19 వన్డే జట్టులో యాదవ్ సభ్యుడిగా ఉన్నాడు. ఇతని స్థానంలో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఆర్యన్ సవ్సానిని, మల్టీ-డే జట్టులో హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన తన్మయ్ బలోడాను నియమించింది.

బీసీసీఐ ఏం చెప్పిందంటే..

"రాజ్‌కోట్, అహ్మదాబాద్‌లలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరగబోయే మ్యాచ్‌ల కోసం భారత అండర్-19 జట్లలో చోటు దక్కించుకున్న రోహిత్‌ను, వయసులో వ్యత్యాసాల కారణంగా జట్టు నుంచి తొలగించినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రోహిత్, జూలైలో జరిగిన అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి, ఆరు వికెట్లు పడగొట్టి, చివరి యూత్ టెస్టులో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రోహిత్‌పై రెండేళ్ల నిషేధం...

స్పోర్ట్‌స్టార్ నివేదిక ప్రకారం, లెగ్ స్పిన్నర్ అయిన రోహిత్ 2014 నుంచి తన పుట్టిన తేదీని పలుమార్లు మార్చుకున్నాడు. దీనితో బీసీసీఐని మోసం చేస్తున్నారనే రూఢీ కావడంతో బీసీసీఐ అతనిపై రెండేళ్ల నిషేధం విధించింది.
అయితే, బీసీసీఐ ఈ నిషేధాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 2014లో రోహిత్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB)లో నమోదు చేసుకున్నప్పుడు, అతని పుట్టిన తేదీ జూలై 7, 2007గా నమోదు చేసుకున్నాడు. చిరునామా ఉత్తర ప్రదేశ్‌గా పేర్కొనబడింది.
2017 ఆధార్ అప్‌డేట్‌లో అతని పుట్టిన సంవత్సరాన్ని 2006కి మార్చగా, 2020లో చేసిన మరో అప్‌డేట్‌లో కూడా 2006గానే కొనసాగిందని ఆ నివేదిక తెలిపింది. అయితే, 2021లో అతని పుట్టిన సంవత్సరం మళ్లీ మార్చబడింది. ఈసారి 2009కి. 2022, 2023, 2024లో జరిగిన తదుపరి ఆధార్ అప్‌డేట్‌లలో కూడా 2009 మార్చారు.
ఈలోగా, అతని చిరునామా కూడా ఉత్తర ప్రదేశ్ నుంచి హౌరాకు మార్చుకున్నారు. తర్వాతి రికార్డులలో లిలువాగా పేర్కొన్నారు.
వన్డే మ్యాచ్‌ల కోసం భారత అండర్-19 జట్టు: లక్ష్య రైచందాని (కెప్టెన్), యశ్‌బర్ధన్ చౌహాన్ (వైస్ కెప్టెన్), రజత్ బఘేల్ (వికెట్ కీపర్), ఆర్యవీర్ సెహ్వాగ్, వి.కె. వినీత్, కుశాగ్ర ఓఝా, అర్జున్ రాజ్‌పుత్, మనల్ చౌహాన్, అన్వే ద్రావిడ్ (వికెట్ కీపర్), వి. యశ్‌వీర్, షవిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకట, కావ్య పటేల్, ఆర్యన్ సవ్సాని.
మల్టీ-డే మ్యాచ్‌ల కోసం భారత U-19 జట్టు: యష్‌బర్ధన్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్య రాయచందానీ (వైస్ కెప్టెన్), సాగర్ విర్క్, కుషాగ్ర ఓజా, మనల్ చౌహాన్, కుష్ పటేల్, మానవ్ కృష్ణ (వికెట్ కీపర్), అభిప్రయ్ బిశ్వాస్, ఇవ్‌షాన్ ఓకేరామ్ (వికెట్), ఇవ్‌షాన్ ఓకేరామ్ రాఘవేంద్ర, ప్రియాంషు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్, తన్మయ్ బలోడా.


Read More
Next Story