తొలి టెస్ట్ లో లంకపై భారత్ విజయం
x
మానవ్ సుతార్

తొలి టెస్ట్ లో లంకపై భారత్ విజయం

ఆరు వికెట్లతో చెలరేగిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్


Click the Play button to hear this message in audio format

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఆరు వికెట్లతో విజృంభించడంతో లంక 165 పరుగులతో ఓటమి పాలైంది. దీనితో రెండు మ్యాచ్ లో సిరీస్ లో భారత్ 1-0 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఇది భారత్ కు 600 వ టెస్ట్ మ్యాచ్ కావడంతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ మ్యాచ్ లో సుతార్ మొత్తం పది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. లంక ఆలౌట్ అయిన ఐదు నిమిషాలకే గాలే లో భారీ వర్షం కురిసింది. దీనితో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది.

దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ చేతిలో చిత్తు..

భారత్ కు ఈ టెస్ట్ విజయం ఆనందానిచ్చే అంశం. ఎందుకంటే భారత్ లో ఇలాంటి పిచ్ లపై ఇంతకుముందు క్రికెట్ ఆడిన భారత్.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కు గురయ్యాము. ఆట ఆఖరి రోజు నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన లంక.. ఏ దిశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు.
ఈ మ్యాచ్ లో సుతార్ 6/55 సూపర్ స్పెల్ తో లంక చివరి బ్యాట్స్ మెన్ ను కుప్పకూల్చాడు. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన తన తొలి టెస్ట్ లో ఇదే ఘనత సాధించిన తరువాత వరుసగా రెండో సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. తొలి ఇన్నింగ్స్ లో కూడా సుతార్ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. లంచ్ తరువాత 175 ఆరు వికెట్లతో ఉన్న లంక.. సుతార్ బౌలింగ్ రావడంతో ఆట గమనం మారిపోయింది.
మొదట సోనల్ దినూష(84) పెవిలియన్ పంపిన సుతార్.. ప్రభాత్ జయసూర్య, లహిరు కుమారలను అవుట్ చేసి భారత్ విజయాన్ని ఖరారు చేశాడు. ఈ రోజు లంక పట్టుదల చూసి భారత్ కు విజయం దక్కడం అంత ఈజీ కాదని అనిపించింది.
ముఖ్యంగా దినూష, కెప్టెన్ ధనంజయ డిసిల్వా వికెట్ కోల్పోకుండా ఓపిక బ్యాటింగ్ చేశారు. దీనితో భారత్ బౌలర్లు అసహనానికి గురయ్యారు. కానీ ఎట్టకేలకు డిసిల్వా స్వీప్ షాట్ కొట్టే ప్రయత్నంలో అవుట్ కావడంతో భారత శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. తరువాత రెండో సెషన్ లో సుతార్ రాకతో లంక కుప్పకూలింది. రెండో టెస్ట్ ఆగష్టు 23 నుంచి కొలంబో వేదికగా జరగనుంది.
Read More
Next Story