
భారత ఆటగాళ్లు
భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం ముప్పు?
శ్రీలంకలో అల్ప పీడనం, రేపటి మ్యాచ్ కు 70 శాతం వర్షం ముప్పు
భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నటీ20 పురుషుల ప్రపంచకప్ లో రేపు మరో ఆసక్తికర సమరం జరగబోతోంది. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్, పాకిస్తాన్ రేపు కొలంబో వేదికగా తలపడబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీలంక వాతావరణ శాఖ నివేదిక ప్రకారం రేపు దాదాపు 70 శాతం వరకూ వర్షం కురిసే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్ లో భారతే ఫేవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మొన్న జరిగిన రెండు మ్యాచ్ లలో బ్యాట్స్ మెన్ సరిగా ఫామ్ లోకి రాకపోవడం, ఒపెనర్ అభిషేక్ శర్మ జ్వరంతో బాధపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
మొదట్లో భారత్ తో మ్యాచ్ ఆడేది లేదని భీష్మించుకున్న పాకిస్తాన్, తరువాత కొలంబో చేరి మ్యాచ్ ఆడుతున్నట్లు ప్రకటించింది. రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ ఎనిమిది మ్యాచ్ లు జరగగా, భారత్ ఏడు గెలిచింది. పాకిస్తాన్ కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లోనే విజయ సాధించిందది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), బంగ్లాదేశ్ శ్రీలంకతో వారాల తరబడి జరిగిన తీవ్రమైన చర్చల తర్వాత పాక్ క్రికెట్ ఆడటానికి ఒప్పుకుంది. ఈ మ్యాచ్ పై క్రీడా ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుండటం, భారీగా వాణిజ్య ఆదాయం కారణంగా పాక్ ప్రకటన ఇబ్బందిగా మారింది.
ఐసీసీ కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం కూడా పీసీబీ దిగిరావడానికి మరో కారణం. బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులే లక్ష్యంగా అక్కడ మతోన్మాద ముఠాలు హత్యలు, దోపిడీలకు పాల్పడుతుండటంతో ఐపీఎల్ లో కేకేఆర్ నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ తప్పించారు.
ఈ పరిణామాలతో బంగ్లాదేశ్ భారత్ లో మ్యాచ్ లను ఆడబోమని, భద్రత కారణాలను సాకుగా చూపిస్తూ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ కు మద్దతుగా పాకిస్తాన్ కూడా భారత్ తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది.
కొలంబో మ్యాచ్ లో అభిషేక్, కుల్దీప్ ఆడబోతున్నారా?
డాషింగ్ ఒపెనర్ అభిషేక్ శర్మ తొలి మ్యాచ్ లో డకౌట్ అవగా, రెండో మ్యాచ్ లో కడుపు నొప్పి కారణంగా బరిలోకి దిగలేకపోయాడు. ఒక పాక్ తో జరిగే మ్యాచ్ లోనూ శర్మ అందుబాటులో లేకపోతే శాంసన్ కు మరో ఛాన్స్ దక్కుతుంది.
లేదంటే వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టులోకి తీసుకుని ఇషాన్ తో ఒపెనింగ్ కు అయిన వచ్చే అవకాశం ఉంది. కొలంబోలోని ప్రేమదాస పిచ్ నెమ్మదిగా ఉండి, స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది.
ఇక్కడ వాషింగ్టన్ తో పాటు మరో చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ను సైతం తుదిజట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ అదే జరిగితే ఒక పేసర్ లేదా రింకూ సింగ్ తుది జట్టులోకి రాకపోవచ్చు.
మిడిల్ ఆర్డర్ కుప్పకూలడం..
ప్రపంచకప్ కు ముందు దంచి కొట్టిన భారత బ్యాట్స్ మెన్లు, వరల్డ్ కప్ లో ఇప్పటి వరకూ జరిగిన రెండు మ్యాచ్ లలో అంచనాల మేరకు రాణించలేకపోయారు. యూఎస్ఏ తో జరిగిన మ్యాచ్ లో టాప్ ఆర్డర్ విఫలం కాగా, నమీబియాతో జరిగిన మ్యాచ్ లో లోయర్ ఆర్డర్ చేతులెత్తేసింది.
ఈ రెండు మ్యాచ్ లలోనూ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ మాత్రమే రాణించారు. పాక్ తో జరిగే మ్యాచ్ లో గెలవాలంటే అందరూ సమష్టిగా రాణించాల్సిందే.
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫిలో నిర్వహించిన హైబ్రిడ్ మోడల్ లాగే పాక్ కూడా ఐసీసీ 20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తమకు కొలంబోలోనే అన్ని మ్యాచ్ లు ఉండేలా ఒత్తిడి చేయగలిగింది.
గత రెండు వారాలుగా వాళ్లు ఇక్కడే ఉండటం మూలంగా అక్కడి పరిస్థితులన్నీ ఆకలింపు చేసుకున్నారు. ఆ జట్టుకు ఇక్కడ ఉస్మాన్ తారిక్, సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ ఉన్నారు.
ముఖ్యంగా తారిక్ అహ్మద్ బౌలింగ్ శైలి చర్చనీయాంశంగా మారింది. అహ్మద్ బౌలింగ్ ను భారత బ్యాట్స్ మెన్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. పాకిస్తాన్ ఇప్పటి వరకూ ఆడిన రెండు మ్యాచ్ లలో ఓ మోస్తారు ప్రదర్శన మాత్రమే చేయగలిగింది.
దాని బౌలింగ్ దళానికి ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదు. ఢిపెండింగ్ ఛాంపియన్ గా ఉన్నభారత్ ఈ మ్యాచ్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తుందని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.
శ్రీలంక వాతావరణ శాఖ బంగాళాఖాతంలో అభివృద్ధి చెందుతున్న అల్పపీడనం గురించి హెచ్చరించింది, దీని అర్థం ఆదివారం సాయంత్రం ఖెట్టారామ ప్రాంతంలో వర్షం పడే అవకాశం 70 శాతం వరకు ఉంటుంది.
జట్లు అంచనా
భారతదేశం: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు సామ్సన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్.
పాకిస్థాన్ (అంచనా): సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫే, మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్కీమాన్, ఉస్కీమాన్.
మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది
Next Story


