అంతర్జాతీయ క్రికెట్ నుంచి స్టోక్స్ అనూహ్య రిటైర్ మెంట్
x
బెన్ స్టోక్స్

అంతర్జాతీయ క్రికెట్ నుంచి స్టోక్స్ అనూహ్య రిటైర్ మెంట్

న్యూజిలాండ్ తో మూడో టెస్ట్ మధ్యలోనే రిటైర్ మెంట్ ప్రకటన


Click the Play button to hear this message in audio format

అంతర్జాతీయ క్రికెట్ నుంచి మరో దిగ్గజం నిష్క్రమించారు. ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మధ్యలో స్టోక్స్ ఈ నిర్ణయం ప్రకటించాడు. స్టోక్స్ దాదాపు 15 సంవత్సరాలుగా ఇంగ్లండ్ క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించాడు.

ట్రెంట్ బ్రిడ్జ్ లో జరుగుతున్న మూడో టెస్ట్ టీ విరామానికి కొద్దిసేపు ముందు తన నిర్ణయాన్ని తన సహచరులకు చెప్పిన స్టోక్స్.. ఈ రెండు రోజుల ఆటే తన అంతర్జాతీయ క్రికెట్ చివరిదని వెల్లడించాడు. తరువాత ఈ నిర్ణయాన్ని స్టేడియంలో ఎల్ఈడీ స్క్రీన్ పై వెలువరించడంతో ప్రేక్షకులు కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం పలికారు.
స్టేడియంలోకి వచ్చిరాగానే న్యూజిలాండ్ బ్యాట్సె మెన్ జాక్ ఫోక్స్ వికెట్ తీయడంతో స్టేడియం సంబరాలతో హోరెత్తిపోయింది. తరువాత ఇంగ్లండ్ కెప్టెన్ గా హ్యారీ బ్రూక్ నియామకం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

స్టోక్స్ కెరీర్ లో మైలురాళ్లు..

స్టోక్స్ కెరీర్ లో ముఖ్యమైనది 2019 వన్డే ప్రపంచకప్ ను గెలుచుకోవడం. ఫైనల్ లో న్యూజిలాండ్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన స్టోక్స్ మ్యాచ్ టై కావడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా చివరి ఓవర్ లో అతడు ఆడిక కీలక ఇన్నింగ్స్ చిరస్మరణీయం. 2022 లో ఆసీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ను ఇంగ్లండ్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
2019లో యాషెష్ చివరి టెస్ట్ లో హెడింగ్లీ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో బెన్ ఆడిన ఇన్నింగ్స్ ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతం. 135 పరుగులు చేసిన స్టోక్స్ 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, యాషెష్ నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
తొమ్మిది వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ను విజయతీరాలకు చేర్చిన ఘనత స్టోక్స్ దే. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఆదివారం తన సహచర ఆటగాళ్లకు స్టోక్స్ చెబుతున్న వీడియోను సోషల్ మీడియాలో ఈసీబీ విడుదల చేసింది.

లేట్ నైట్ పార్టీతో వివాదం..

న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ విజయం తరువాత స్టోక్స్, పేసర్ అట్కిసన్ క్లబ్ కు వెళ్లి తప్పతాగి గొడవకు దిగడంతో వివాదం చెలరేగింది. దీనితో రెండ్ టెస్ట్ కు స్టోక్స్ ను ఈసీబీ తప్పించింది. ఈ వివాదంతో స్టోక్స్ తన కెరీర్ కు అప్పుడే రిటైర్ అవుతాడని అందరూ ఊహించారు.

మంచి ఆటగాడే.. వివాదాస్పద వ్యక్తి..

ఇంగ్లాండ్ అత్యంత గొప్ప క్రికెటర్లలో ఒకరు, తరానికి చెందిన ప్రముఖ వ్యక్తులలో ఒకరని ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ అన్నారు. అతని అలుపెరగని పోరాటం, కీలక సమయాలలో చేసిన అసాధారణ ప్రదర్శన తనతో పాటు లక్షలాది అభిమానులను శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞాపకాలు ఇచ్చాయని ఆయన అన్నారు.
అయితే స్టోక్స్ కెరీర్ లోనూ వివాదాలు కూడా అలానే ఉన్నాయి. 2018 లో బ్రిస్టల్ సిటీలో జరిగిన వీధి గొడవల్లో అతని పాత్రపై ఆరోపణలు వచ్చాయి. పోలీసులు స్టోక్స్ ను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వార్తా పత్రికలలో ప్రముఖంగా వచ్చాయి. ఇద్దరు స్వలింగ సంపర్కులను రక్షించడానికి తాను జోక్యం చేసుకున్నానని స్టోక్స్ విచారణ సందర్భంగా చెప్పారు.
ఈ ఘటనతో యాషెష్ సిరీస్ నుంచి తొలగించబడ్డాడు. కానీ నిర్ధోషిగా తీర్పు రావడంతో మరోసారి జట్టులోకి వచ్చాడు. 2021 లో తన మానసిక ఆరోగ్యం కోసం క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు. 2022 నుంచి ఇంగ్లండ్ కెప్టెన్ గా నియామకం అయ్యాడు. తరువాత మెక్ కల్లం కోచ్ గా నియామకం అవడంతో ‘బజ్ బాల్’ను ప్రవేశపెట్టాడు.

తదుపరి కెప్టెన్ బ్రూక్..

ఇంగ్లండ్ తదుపరి కెప్టెన్ గా హ్యరీ బ్రూక్ నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే బ్రూక్ కూడా వెల్లింగ్ టన్ లో నైట్ క్లబ్ లో బౌన్సర్లతో గొడవపడ్డాడు. అయితే ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్ కు బ్రూక్ కెప్టెన్ గా ఉన్నాడు. రెండో టెస్ట్ కు జో రూట్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ అతను తిరిగి నాయకత్వ బాధ్యతలు స్వీకరించడానికి సిద్దంగా లేడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టులో స్టోక్స్ సమర్థుడైన ఆల్ రౌండర్. అతని సేవలు లేకపోవడం ఆ జట్టుకు నష్టమే.ఈ సిరీస్ లోనే న్యూజిలాండ్ ఆల్ టైమ్ గ్రేట్ లలో ఒకరైన కేన్ విలియమ్సన్ కూడా రిటైర్ అయ్యారు.
Read More
Next Story