కాషాయ రంగు జెర్సీ తో హకీ ఇండియా జట్టు
x
జెర్సీ మారిన తరువాత భారత హకీ జట్లు

కాషాయ రంగు జెర్సీ తో హకీ ఇండియా జట్టు

జెర్సీ మార్పుతో వివాదంలో హకీ జట్టు


Click the Play button to hear this message in audio format

టీమిండియా ఏ క్రీడల్లో పోటీ పడినా బ్లు జెర్సీనే మనం ఇన్నాళ్లు చూశాం. కానీ మొదటిసారి హకీ జట్టు తన జెర్సీని మార్చడం వివాదంగా మారింది. అది కూడా కాషాయ రంగు కావడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నిర్ణయం తనకు తెలియకుండా తీసుకున్నారని అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పేర్కొనగా, ఈ మార్పు గురించి "అధికారులందరికీ తెలుసు" అని కార్యదర్శి భోలా నాథ్ సింగ్ నొక్కి చెప్పారు.

కొత్త జెర్సీలపై విమర్శలు..

సాంప్రదాయకంగా నీలి రంగు దుస్తులు ధరించే భారత హాకీ జట్లు, ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్- బెల్జియంలో ప్రారంభమయ్యే ప్రపంచ కప్‌లో కాషాయ రంగు కిట్‌లను ధరించనున్నాయి. జూలై 27న ప్రకటించిన యూనిఫాం రంగు మార్పు, వాసుదేవన్ భాస్కరన్, వీరేన్ రస్క్విన్హా, అజిత్ పాల్ సింగ్, పర్గత్ సింగ్ వంటి మాజీ ఆటగాళ్ల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.
అయితే టిర్కితో సహ హకీ ఇండియా ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఆటలు ఆడే నీలిరంగు టర్ఫ్‌తో మన జెర్సీ పూర్తిగా కలిసిపోయినట్లు ఉందని, అందుకే జట్టుకు కొత్త జెర్సీ డిజైన్ చేసినట్లు పేర్కొంది. ఈ రంగు "ఆటగాళ్లకు మైదానంలో స్పష్టత, దృశ్యమానతను" ప్రభావితం చేస్తుందని ఆ సంస్థ పేర్కొంది.

టిర్కీ వివరణ కోరారు..

హాకీ ఇండియా అధికారులకు పంపిన ఒక అంతర్గత మెయిల్‌లో, "చర్చ కోసం కార్యనిర్వాహక మండలి ముందు ఉంచకుండా, నాకు ముందస్తుగా తెలియకుండా" ఈ నిర్ణయం తీసుకున్నారని టిర్కీ పేర్కొన్నారు.
"ఈ నిర్ణయానికి గల ఆధారం, అనుసరించిన ప్రక్రియ, ఏ పరిస్థితులలో ఈ మార్పు ఆమోదించబడి, అమలు చేయబడిందో వివరిస్తూ, సంబంధిత హెచ్‌ఐ అధికారులు వీలైనంత త్వరగా నాకు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఇది నేను సముచితంగా, కచ్చితంగా స్పందించడానికి వీలు కల్పిస్తుంది" అని ఆయన ఆ మెయిల్‌లో తెలిపారు. జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న ఒడిశా ప్రభుత్వం ఈ వివరణను కోరింది.
"ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ఒడిశా ప్రభుత్వం కూడా నన్ను కోరింది. అందువల్ల, నేను సముచితంగా, కచ్చితంగా స్పందించడానికి వీలుగా, సంబంధిత హాకీ ఇండియా అధికారులు వీలైనంత త్వరగా నాకు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను" అని టిర్కీ అన్నారు.

ఆటగాళ్లు రంగు మార్పు కావాలని అనుకున్నారు..

సరైన సంప్రదింపుల తర్వాత ఆటగాళ్లు కోరిన దానిని క్రీడా సంస్థ కేవలం అమలు చేసిందని స్పష్టం చేశారు. “రంగు మార్చే నిర్ణయం మా అంతర్గత బృందంలో చర్చించాం. కాబట్టి అధికారులందరికీ దాని గురించి తెలిసి ఉండాలి. ఇది ఇంత పెద్ద సమస్య అవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. రంగు మార్పు కోసం మాపై ఎక్కడి నుంచీ బయటి ఒత్తిడి లేదు. దీనిని అనవసరంగా రాజకీయం చేస్తున్నారు,” అని సింగ్ పీటీఐకి తెలిపారు.
హాకీ ఇండియా ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తుందా అని అడగ్గా, సింగ్ ఇలా అన్నారు. "నేను ఒక్కడినే నిర్ణయాలు తీసుకోలేను. ఒక అధ్యక్షుడు, ఇతర కార్యనిర్వాహకులు ఉన్నారు. మేము కూర్చుని చర్చించుకోవాలి. చివరికి ఇది ఆటగాళ్లు.. కోచ్‌ల డిమాండ్, మేము దానికి తలొగ్గాము.” “ఆటగాళ్లు, కోచ్‌లతో కూడా మాట్లాడాలి. ఇది ఇంత పెద్ద సమస్య అవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు.” అన్నారు.

టిర్కి యూటర్న్..

గురువారం తాను తీసుకున్న వైఖరిని సమర్థిస్తూ, ప్రపంచ కప్‌కు ముందు ఎలాంటి వివాదం తలెత్తకుండా ఉండేందుకు అలా చేశానని టిర్కీ తన ఈమెయిల్‌లో పేర్కొన్నారు.
"అప్పటి నుంచి ఈ విషయం మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ కప్ (WC) సమీపిస్తున్నందున, జట్టు, దాని సన్నాహాలపైనే దృష్టి కేంద్రీకరించేందుకు ఈ మార్పు పూర్తిగా క్రీడాపరమైన నిర్ణయమని నేను బహిరంగంగా స్పష్టం చేశాను," అని ఆయన అన్నారు.
కాషాయ రంగు ఎంపిక తన సమస్య కాదని, అయితే ఈ నిర్ణయం ఎన్నికైన నాయకత్వంతో సంప్రదించి తీసుకోవాల్సిందని టిర్కీ నొక్కి చెప్పారు. "కాషాయ రంగు ఎంపికతో నాకు సమస్య లేదు. మన జాతీయ జట్టు గుర్తింపు, ప్రాతినిధ్యానికి సంబంధించిన ఇంతటి ప్రాముఖ్యత గల నిర్ణయాన్ని, అమలు చేయడానికి ముందు ఎన్నికైన నాయకత్వం, EB బోర్డు సభ్యులతో చర్చించి ఉండాల్సింది," అని ఆయన ఈమెయిల్‌లో పేర్కొన్నారు.
"ఇది నిందలు వేయడానికి కాదు, పారదర్శకత, జవాబుదారీతనం, భవిష్యత్తులో మనం ఏర్పాటు చేసుకున్న నిర్ణయ ప్రక్రియలకు కట్టుబడి ఉండేలా చూడటానికే," అని ఆయన నొక్కి చెప్పారు. ఒడిశా ప్రభుత్వానికి, హాకీ ఇండియా డీజీకి మెయిల్స్ పంపబడ్డాయి.
వ్యతిరేకత నేపథ్యంలో, హాకీ ఇండియా అధికారులు జూలై 30న ఒడిశా ప్రభుత్వానికి ఒక ఇమెయిల్ పంపారని ఒక విశ్వసనీయ వర్గం పీటీఐకి తెలిపింది.
దీనిపై వివరణ కోరుతూ టిర్కీ, హాకీ ఇండియా డైరెక్టర్ జనరల్ కమాండర్ ఆర్.కె. శ్రీవాస్తవకు మరో మెయిల్ పంపారని కూడా తెలిసింది. సంప్రదించగా, ఆ సంస్థ కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఒకరు పీటీఐతో మాట్లాడుతూ, ఈ నిర్ణయం గురించి తనకు ముందుగా ఎలాంటి సమాచారం లేదని, సోషల్ మీడియాలో జెర్సీని విడుదల చేసిన తర్వాతే ఈ విషయం తెలిసిందని చెప్పారు.
Read More
Next Story