
ఓటు చోరీ తర్వాత ఇప్పుడు సీటు చోరీ ఆరోపణలు..!
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటున్న కాంగ్రెస్
ఒకవైపు రాజ్యసభ ఎన్నికల నామినేషన్ వివాదం, మరోవైపు ప్రభుత్వ వ్యవహారాల నుంచి సమాచారం లీక్ అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో పలువురు మంత్రుల కార్యాలయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మీనాక్షి నటరాజన్‌పై దాఖలైన ప్రైవేట్ కేసును విచారించే అధికారం తమకు లేదని నాంపల్లి కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. కేసులో ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్నందున, దీనిని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో దాఖలు చేయాలని సూచిస్తూ పిటిషన్‌ను తిరిగి పంపింది. ఈ పరిణామాలు ఎన్నికల వ్యవస్థపై తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నిర్ణయం కేసు దాఖలైన దాదాపు 22 నెలల తర్వాత రావడం గమనార్హం. ఈ ఆలస్యం కారణంగానే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు దారితీసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ గౌని నర్సింహ గౌడ్ విమర్శిస్తున్నారు.
నారాయణపేటకు చెందిన ఆకుల శ్రీలత 2022లో మాజీ కాంగ్రెస్ నాయకుడు K. శివకుమార్ రెడ్డి తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా 2025 ఫిబ్రవరి 14న నియమించారు.మీనాక్షిపై ఎలాంటి FIR నమోదు కాలేదు.తెలంగాణ పోలీసులు కూడా ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ప్రైవేట్ ఫిర్యాదులో ఆమెపై కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోలేదు.కేవలం కోర్టు నోటీసు మాత్రమే వచ్చింది.ఆ నోటీసుకు ఆమె సమాధానం కూడా ఇచ్చారు.Form-26లో ప్రీ-కాగ్నిజెన్స్ దశలో ఉన్న ప్రైవేట్ ఫిర్యాదులను తప్పనిసరిగా వెల్లడించాలనే నిబంధన లేదని, బిజెపి కుట్రపూరితంగానే మీనాక్షి నటరాజన్‌ను ఇరికించారని గౌని నర్సింహ గౌడ్ ఆరోపించారు.బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ గేమ్ ఆడుతున్నాయని గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వ సమాచారం లీక్ అవుతోందన్న నిఘా హెచ్చరికలతో, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా కొందరు మంత్రులు తమ కార్యాలయాల్లో సిబ్బందిపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
1) మంత్రి కొండా సురేఖ OSD సుమంత్ ను విధుల నుంచి తప్పించారు.
2) మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్ద OSDగా పనిచేసిన IFS అధికారి శ్రీలక్ష్మి ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు.
3) మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద OSDగా పనిచేసిన యుగంధర్ అకస్మాత్తుగా విధులకు దూరమయ్యారు.అనంతరం ఆయన వ్యక్తిగత కార్యదర్శి (PS) చంద్రమోహన్ కూడా బాధ్యతలు వీడారు.
4) మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వద్ద PSగా ఉన్న పురుషోత్తం రెడ్డి ఇటీవల పదవి నుంచి తప్పుకున్నారు.
5) మంత్రి దామోదర రాజనర్సింహ వద్ద OSDగా కొనసాగిన పాక రమేష్ కూడా ఇటీవల ఆ బాధ్యతలను వీడారు.
6) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద OSDగా పనిచేసిన సురేందర్ రెడ్డి మరో శాఖకు బదిలీ అయ్యారు.
7) మంత్రి జూపల్లి కృష్ణారావు వద్ద OSDగా పనిచేసిన రాజేందర్ కూడా వెళ్ళిపోయారు.
ఒకవైపు రాజ్యసభ నామినేషన్ వివాదం, మరోవైపు మంత్రుల కార్యాలయాల్లో వరుస మార్పులు చోటుచేసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపింది. ఎన్నికల ప్రక్రియ, న్యాయపరమైన వివాదాలు, పరిపాలనా వ్యవహారాల్లో గోప్యత అంశాలు కలిసి రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిస్థితులను సృష్టిస్తున్నాయి.

