
నీట్ రీ-ఎగ్జామ్‌కు రంగం సిద్ధం..
సీటు వస్తుందా..? డాక్టర్ కావాలంటే 73,000 మందిని దాటాలి!
తెలంగాణలో నీట్ (UG) రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు ప్రభుత్వం కీలక సౌకర్యం కల్పించింది. జూన్ 21న పరీక్ష రోజున టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. గ్రామీణ విద్యార్థుల ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నీట్ (UG) రీ-ఎగ్జామ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న నకిలీ వార్తలను అడ్డుకునేందుకు ఎన్‌టీఏ కీలక చర్య తీసుకుంది. విద్యార్థులకు సరైన, తాజా సమాచారం అందించేందుకు అధికారిక వాట్సాప్ ఛానల్‌ను ప్రారంభించింది. అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాలు, నిబంధనలు వంటి సమాచారం ఇకపై ఈ ఛానల్ ద్వారానే అందుతుంది. అనధికారిక లింకులు, ఫేక్ మెసేజ్‌లు, “లీక్ పేపర్లు” అంటూ వచ్చే పోస్టులపై జాగ్రత్తగా ఉండాలని ఎన్‌టీఏ హెచ్చరించింది. కేవలం అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లేదా వాట్సాప్ ఛానల్ ద్వారానే సమాచారం నమ్మాలని సూచించింది. పరీక్ష ప్రక్రియ పారదర్శకంగా, భద్రతతో జరుగుతుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

