చెన్నై లవ్ స్టొరీ ఎలా ఉంది ?
x

'చెన్నై లవ్ స్టొరీ' ఎలా ఉంది ?


కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా మూవీ 'చెన్నై లవ్ స్టోరీ'. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాయి రాజేష్ కథ అందించగా, ఎస్.కే.ఎన్ కాంబినేషన్‌లో మాస్ మూవీ మేకర్స్ మరియు అమృత ప్రొడక్షన్స్ నిర్మించాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం, పాటలు విడుదలకంటే ముందే సినిమాపై మంచి అంచనాలను పెంచాయి.


నటీనటుల నటన పరంగా కిరణ్ అబ్బవరం తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోగా, శ్రీ గౌరీ ప్రియ తన సహజసిద్ధమైన ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్‌ఫెయిల్యూర్, మళ్లీ ప్రేమ అనే పాయింట్‌తో రూపొందిన ఈ చిత్రం, మణిశర్మ నేపథ్య సంగీతం అండతో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే క్లాసిక్ లవ్ అన్న టాక్ ఇప్పుడు ఉంది.


Read More
Next Story