ఫుట్‌పాత్‌లు ప్రజలకా? వ్యాపారాలకా?
x

ఫుట్‌పాత్‌లు ప్రజలకా? వ్యాపారాలకా?

ఒక్క వర్షానికే అస్తవ్యస్తమైన హైదరాబాద్ | సొంతింటి కోసం 77 లక్షల మంది ఎదురుచూపు


ఈ రోజు ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం.లో

1. సొంతింటి కోసం 77 లక్షల మంది ఎదురుచూపు

2. ఒక్క వర్షానికే అస్తవ్యస్తమైన హైదరాబాద్

3. ఫుట్‌పాత్‌లు ప్రజలకా? వ్యాపారాలకా?

1. సొంతింటి కోసం 77 లక్షల మంది ఎదురుచూపు

తెలంగాణలో సొంతింటి కోసం భారీ డిమాండ్ నెలకొంది. 77.68 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, గత ప్రభుత్వం నిర్మించిన 2BHK ఇళ్లలో కొంత భాగమే పూర్తయ్యాయి. హైదరాబాద్ పరిధిలో ఖాళీగా ఉన్న 15 వేల ఇళ్లను గుర్తించి అర్హులకు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక కొత్తగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 4.5 లక్షల ఇళ్లను మొదటి విడతలో మంజూరు చేశారు.

2. ఒక్క వర్షానికే అస్తవ్యస్తమైన హైదరాబాద్

ఒక్క వర్షానికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైంది. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, కార్పొరేషన్ల మధ్య సమన్వయ లోపంతో నగరవ్యాప్తంగా వరద ముంపు, భారీ ట్రాఫిక్ జామ్‌లు, విద్యుత్ అంతరాయాలు చోటుచేసుకున్నాయి. సుమారు 3 లక్షల మంది వాహనదారులు రోడ్లపై చిక్కుకుపోయారు. పలుచోట్ల 24 గంటలకు పైగా కరెంట్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాల సన్నద్ధత లోపాలు, పూడికతీత ఆలస్యం, ఎమర్జెన్సీ బృందాల కొరత నగర మౌలిక వసతుల బలహీనతలను మరోసారి బయటపెట్టాయి.

3. ఫుట్‌పాత్‌లు ప్రజలకా? వ్యాపారాలకా?

హైదరాబాద్‌లో మెట్రో స్టేషన్ల కింద ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన వాణిజ్య స్టాళ్లపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాదచారుల కోసం ఉద్దేశించిన స్థలాలను వ్యాపారాలకు ఎలా కేటాయించారో వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీ, మెట్రో రైల్ అధికారులను ఆదేశించింది. ఫుట్‌పాత్‌ల వినియోగంపై స్పష్టమైన విధానం అవసరమని కోర్టు అభిప్రాయపడింది.

Read More
Next Story