
అయోధ్య హుండీలో తెలంగాణ భక్తుల డబ్బు ఎంత?
"భక్తుల విరాళాలపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన డిజిటల్ ఆడిట్ వ్యవస్థ అవసరమా?"
తెలంగాణ నుంచి ప్రతిరోజూ, ప్రతి నెలా వేలాది మంది అయోధ్య రామ మందిరానికి వెళ్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, కాజీపేట్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు, టూర్ ప్యాకేజీలు కూడా నడుస్తున్నాయి. అంటే...తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హుండీలో నగదు, బంగారం, వెండి సమర్పించే అవకాశం ఉంది.
రామ మందిరానికి ఇప్పటివరకు రూ.3,000 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్లు వివిధ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇందులో హుండీ నగదు, ఆన్‌లైన్ విరాళాలు, చెక్కులు, బంగారం, వెండి వంటి విభిన్న రూపాల్లో వచ్చిన సమర్పణలు కూడా ఉన్నాయి. రాష్ట్రాల వారీగా విభజించిన లెక్కలను ట్రస్ట్ ప్రకటించలేదు.
అయోధ్య హుండీ వివాదం కేవలం ఉత్తరప్రదేశ్‌కే పరిమితం కాదు. దేశం నలుమూలల నుంచి, తెలంగాణ సహా లక్షలాది మంది భక్తులు తమ విశ్వాసంతో సమర్పించే విరాళాల నిర్వహణలో పారదర్శకత ఎంత ముఖ్యమో ఈ వివాదం మరోసారి గుర్తు చేస్తోంది.
రామమందిర ప్రాణ ప్రతిష్ఠ తర్వాత (జనవరి 2024) తొలి రెండు నెలల్లో సుమారు 3 లక్షల మంది తెలంగాణ భక్తులను అయోధ్యకు తీసుకెళ్లే లక్ష్యంతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాయి. రోజుకు సుమారు 5,000 మంది చొప్పున 60 రోజుల పాటు యాత్ర నిర్వహించాలని అప్పట్లో ప్రకటించారు.
2024లో అయోధ్య జిల్లాను 16 కోట్లకు పైగా సందర్శకులు సందర్శించినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలిపింది. ఈ సంఖ్యలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల యాత్రికులు, పర్యాటకులు ఉంటారు. తెలంగాణకు ప్రత్యేక లెక్కలు లేవు.
అసలు వివాదం ఏంటి?
అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరంలో భక్తులు సమర్పించిన హుండీ నగదు, బంగారం, వెండి తదితర విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. ప్రాథమిక విచారణ ఆధారంగా ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, పలువురిని అరెస్ట్ చేశారు. నగదు లెక్కింపు, భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ, నగదు బ్యాంకుకు తరలింపు ప్రక్రియల్లో లోపాలు ఉన్నాయని SIT గుర్తించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ గోల్‌మాల్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సుమారు రూ.7.5 కోట్ల నగదు దుర్వినియోగం జరిగినట్లు అంచనా వేశారు.
ఆరోపణలు ఏమిటి?
వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న అంశాలు:
హుండీలో వచ్చిన నగదు దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు.
నగదు లెక్కింపులో పారదర్శకత లోపించిందన్న విమర్శలు.కొంత CCTV ఫుటేజ్ లేకపోవడం లేదా పర్యవేక్షణలో లోపాలున్నాయన్న ఆరోపణలు.
ఉద్యోగుల నియామకం, పర్యవేక్షణలో నిర్లక్ష్యం జరిగిందని SIT గుర్తించినట్లు వార్తలు.
ట్రస్ట్ ఏమంటోంది?
శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అక్రమాలను ఖండించింది.
ట్రస్ట్ ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదైందని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తామే కోరామని పేర్కొంది. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపింది.
రాజకీయ రచ్చ
ఈ వ్యవహారం రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపింది.
కాంగ్రెస్ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేసింది.ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది.యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, అయోధ్య ప్రతిష్ఠను దెబ్బతీయొద్దని అన్నారు.తెలంగాణలోనూ భారీ హుండీ ఆదాయంతెలంగాణలో యాదాద్రి, భద్రాచలం, వేములవాడ, బాసర వంటి ప్రధాన దేవాలయాలకు ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల హుండీ ఆదాయం వస్తుంది.
భక్తులు అడుగుతున్న ప్రశ్న?
1) "భక్తులు వేసే డబ్బుకు ఎక్కడైనా ఒకే తరహా పారదర్శక వ్యవస్థ ఉందా?"
2) "భక్తుల విరాళాలపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన డిజిటల్ ఆడిట్ వ్యవస్థ అవసరమా?"

