సివిల్స్‌కు ఫ్రీ కోచింగ్! ఫుడ్ + స్టే కూడా ఫ్రీ!
x

సివిల్స్‌కు ఫ్రీ కోచింగ్! ఫుడ్ + స్టే కూడా ఫ్రీ!


సివిల్స్‌ కొట్టాలనే లక్ష్యం ఉంది. కానీ ఖరీదైన కోచింగ్‌ తీసుకునే స్థోమత లేదా? అలాంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత రెసిడెన్షియల్‌ సివిల్స్‌ కోచింగ్‌ అందిస్తోంది. కోచింగ్‌తో పాటు ఉచిత వసతి, భోజనం కూడా కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌–TCRTI ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ మానసా హిల్స్‌లోని ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో ఎంపికైన అభ్యర్థులకు సుమారు 8 నెలల పాటు రెసిడెన్షియల్‌ కోచింగ్‌ ఇవ్వనున్నారు.

ఈ శిక్షణలో యూపీఎస్సీ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, పర్సనాలిటీ టెస్ట్‌కు అవసరమైన గైడెన్స్‌ అందించనున్నారు. అంటే సివిల్స్‌ పరీక్షలోని మూడు దశలకు సిద్ధమయ్యేలా శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యం.ఎన్ని సీట్లు ఉన్నాయి?రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 120 మంది అభ్యర్థులను ఈ కార్యక్రమానికి ఎంపిక చేయనున్నారు.

ఇందులో 100 సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో75 సీట్లు ఎస్టీలకు, 15 సీట్లు ఎస్సీలకు, 10 సీట్లు బీసీలకు కేటాయించారు.మిగిలిన 20 సీట్లను ఎస్టీ అభ్యర్థులకు నేరుగా కేటాయించనున్నారు. గత ఐదేళ్లలో కనీసం ఒక్కసారైనా యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన ఎస్టీ అభ్యర్థులు ఈ 20 సీట్లకు అర్హులు. వీరికి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష అవసరం ఉండదు.

దరఖాస్తు.. పరీక్ష తేదీలు ఇవేఈ ఉచిత కోచింగ్‌కు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

25వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

27వ తేదీన ప్రవేశ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు మొదటి పేపర్‌, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు రెండో పేపర్‌ నిర్వహిస్తారు.

ఆ తర్వాత అక్టోబర్‌ 1న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూలు నిర్వహించి.. అక్టోబర్‌ 2న తుది ఎంపిక జాబితా ప్రకటించనున్నారు.

అక్టోబర్‌ 5 నుంచి క్లాసులుఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్‌ 5 నుంచి సివిల్స్‌ కోచింగ్‌ ప్రారంభం కానుంది.

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు welfare.sriramias.com వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి.

మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన యువతకు ఖరీదైన కోచింగ్‌ భారం లేకుండా సివిల్స్‌కు సిద్ధమయ్యే అవకాశం ఇది. ఉచిత కోచింగ్‌తో పాటు వసతి, భోజనం అందించే ఈ కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.

Read More
Next Story