రేవంత్‌కు రక్తదానం... తెలంగాణ భవన్‌లో హైడ్రామా!
x

రేవంత్‌కు రక్తదానం... తెలంగాణ భవన్‌లో హైడ్రామా!

రేవంత్‌కు రక్తదానం... తెలంగాణ భవన్‌లో హైడ్రామా!


తెలంగాణ భవన్‌ వద్ద రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్‌ వినూత్న నిరసన చేపట్టింది. రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ బీఆర్‌ఎస్‌వీ, బీఆర్‌ఎస్‌వై ఆధ్వర్యంలో 'రేవంత్‌రెడ్డికి రక్తదానం' పేరుతో తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం దానం చేసిన రక్తాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే, ముందుగానే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. కొంతసేపు తెలంగాణ భవన్‌ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.


Read More
Next Story