ఆ ప్రాణాలు ఎంతగా విలవిల్లాడాయో!  ఒకరా ఇద్దరా 8 మంది..
x
బరేలీ రోడ్డుపై దగ్ధమవుతున్న కారు

ఆ ప్రాణాలు ఎంతగా విలవిల్లాడాయో! ఒకరా ఇద్దరా 8 మంది..

చుట్టుముట్టిన మంటలు, తప్పించుకునే మార్గం లేని వాహనం.. నట్టనడిరోడ్డుపై ఎనిమిది మంది నిట్టనిలువునా మాడి మసైపోయారు.ప్రమాదం జరిగిన చోటు బీభత్సంగా ఉంది.


ఆ ప్రాణాలు ఎంతగా అల్లాడి ఉంటాయో కదా.. చుట్టుముట్టిన మంటలు, తప్పించుకునే మార్గం లేని వాహనం.. నట్టనడిరోడ్డుపై ఎనిమిది మంది నిట్టనిలువునా మాడి మసైపోయారు. అత్యంత విషాదకరమైన ఈ దారుణం ఉత్తరప్రదేశ్ బరేలి వద్ద జరిగింది.

ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే.

ఉత్తరప్రదేశ్‌ బరేలీ వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన కారు-ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో కారులో మంటలు చెలరేగాయి. 8 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం. కారు నుంచి బయటపడే మార్గం లేక పోవడం, కారు డోర్ లాక్ కావడంతో ఒక్కరూ బయటకి రాలేక పోయారు. కారులో ఉన్న మొత్తం ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు. సమీప గ్రామంలోని ఓ పెళ్లి కోసం కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది.

అబ్బో.. ఆ దృశ్యాలను చూడలేం...

కారు డ్రైవరు ఎదురుగా వస్తున్న ట్రక్కును గమనించకుండా వేగంగా నడుపుతున్నాడు. ఒక్కసారిగా ట్రక్కును గమనించి బ్రేకులు వేయడంతో కారు డివైడర్ ను ఢీకొట్టింది. కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టినట్లు బరేలీ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ సుశీల్ చంద్ర భాన్ ధులే కథనం. ట్రక్కు డ్రైవర్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కారు డ్రైవర్ సహా అందరూ చనిపోయారు. ప్రమాదం జరిగిన చోటు బీభత్సంగా ఉంది. కాలి పోయిన శరీరభాగాలు, మండుతున్న కారు నుంచి పొగలు, ఎవరెవరో గుర్తించలేని విధంగా ఛిద్రమైన ముఖాలతో వర్ణింపనలివి కాకుండా అక్కడి పరిస్థితి ఉంది. అగ్నిమాపక యంత్రాలు ప్రమాద స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పుతున్నాయి.

Read More
Next Story