చంద్రబాబు నాయుడు కేసుల విచారణ వాయిదా
x
కోర్డు ఆర్డర్

చంద్రబాబు నాయుడు కేసుల విచారణ వాయిదా


టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి సంబంధించిన పలు కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ల పై విచారణను హైకోర్టు డిసెంబర్ 12 కి వాయిదా వేసింది. ఇప్పటికే స్కిల్ స్కాం కేసులో బెయిల్ పై ఉన్న చంద్రబాబు నాయుడు ఇసుక కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్లపై హైకోర్డులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.

గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని ఏపీ సీఐడీ కేసులు

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక పాలసీలో భారీ స్థాయిలో కుంభకోణం జరిగిందని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్( ఐఆర్ఆర్) లో కూడా చంద్రబాబు ఆయన అనుయాయులకు భారీ లబ్ధి చేకూరేలా ప్లాన్ మార్చారని కేసు నమోదు అయింది. వీటి అరెస్ట్ నుంచి ఉపశమనం కోరుతూ చంద్రబాబు నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటితో పాటు ఫైబర్ నెట్, మద్యం డిస్టిలరీల కేటాయింపులో అక్రమాలు జరిగాయని చంద్రబాబు నాయుడిపై సీఐడీ కేసులు నమోదు చేసింది.

Read More
Next Story