డీకే శివకుమార్ క్యాబినెట్‌లో తొలి సంక్షోభం..
x

డీకే శివకుమార్ క్యాబినెట్‌లో తొలి సంక్షోభం..

మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా?"


Click the Play button to hear this message in audio format

కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొత్త క్యాబినెట్‌లో అసమ్మతి రాజుకుంది. శాఖల కేటాయింపులో నేతల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. సీనియర్ లీడర్, మంత్రి రామలింగారెడ్డికి జలవనరుల శాఖ కేటాయించారు. అయితే తనకు బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖను కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మంత్రి పదవికి రిజైన్ చేస్తున్నట్లు రాజీనామా లేఖను సీఎం అడిషనల్ చీఫ్ సెక్రటరీ గిరినాథ్‌కు అందజేశారు. దాన్ని సీఎంకు పంపే అవకాశం ఉంది. తనకు బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ ఇస్తామని గతంలో హామీ ఇచ్చారని తన రాజీనామా లేఖలో రామలింగారెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. జలవనరుల శాఖను స్వీకరించడానికి ఆయన ఇష్టపడడంలేదని, తాను ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు రామలింగారెడ్డి తన సన్నిహితులతో చెప్పాడట.

రామలింగారెడ్డిని బుజ్జగించి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తారా? లేక ఈ అసంతృప్తి మరింత మంది నేతల్లో అసమ్మతికి దారితీస్తుందా? కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ఈ పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.

Read More
Next Story