ఉద్ధవ్‌కు భారీ షాక్‌.. షిండే శిబిరంలోకి శివసేన(యూబీటీ) ఆరుగురు ఎంపీలు
x

ఉద్ధవ్‌కు భారీ షాక్‌.. షిండే శిబిరంలోకి శివసేన(యూబీటీ) ఆరుగురు ఎంపీలు

మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ సమీకరణాలు


Click the Play button to hear this message in audio format

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు సోమవారం (జూన్ 22) ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దీంతో ఉద్ధవ్ వర్గానికి భారీ ఎదురుదెబ్బ తగలగా, అధికార శిబిరానికి బలం చేకూరింది.

ఈ ఆరుగురు ఎంపీలు లాంఛనంగా షిండే వర్గంలో చేరడంతో మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మరోసారి మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే శివసేనలో విభజన తర్వాత కొనసాగుతున్న అంతర్గత పోరు మధ్య ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

గత కొన్ని రోజులుగా శివసేన (యూబీటీ)లో అసంతృప్తి పెరుగుతోందన్న ప్రచారం సాగుతోంది. షిండే వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు వచ్చిన ఎంపీల భవిష్యత్తుపై తీవ్ర ఊహాగానాలు వినిపించాయి. ఆ ఊహాగానాలకు తెరదించుతూ, ఆరుగురు ఎంపీలు చివరకు షిండే శిబిరంలోకి వెళ్లారు.

ఈ పరిణామంతో ఉద్ధవ్ థాకరే వర్గం లోక్‌సభ బలం మరింత బలహీనపడగా, షిండే వర్గం మాత్రం రాజకీయంగా మరింత బలపడినట్లైంది. మహారాష్ట్రలో ప్రతిపక్ష శక్తిసామర్థ్యాలపై కూడా ఈ మార్పు ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Read More
Next Story