x
SIR

ఎప్ఐర్ పై కీలక అప్డేట్(వీడియో)

ప్రక్రియను మరో పదిరోజులు పొడుగిస్తున్నట్లు భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది.


తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 25వ తేదీన ముగియాల్సిన ప్రక్రియను మరో పదిరోజులు పొడుగిస్తున్నట్లు భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జూన్ 25వ తేదీన మొదలైన ఎస్ఐఆర్ ప్రక్రియ మామూలుగా అయితే ఈనెల 25వ తేదీన ముగియాల్సుంది. అయితే ప్రక్రియ నూరుశాతం పూర్తికాలేదు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందించటం, ఫిలప్ చేసిన ఫారాలను బీఎల్వోలు తిరిగి తీసుకోవటం, తీసుకున్న ఫారాలను డిజిటలైజ్ చేయటం కాలేదు.

తెలంగాణలోని 3.39 కోట్ల ఓటర్లకు గాను డిజిటలైజ్ అయ్యింది సుమారుగా 1.70 కోట్ల ఓటర్ల వివరాలు మాత్రమే. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్¬, మల్కాజ్ గిరి జిల్లాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య సుమారు 1.10 కోట్లు. ఇందులో డిజిటలైజ్ అయ్యింది కేవలం 35 లక్షల ఓటర్ల వివరాలు మాత్రమే. మిగిలిన ఓటర్ల వివరాలను కమిషన్ డిజిటలైజ్ చేసేదెప్పుడు ? అసలు ఓటర్లలో బీఎల్వోలు ఎంతమంది ఓటర్లకు ఫారాలు ఇచ్చారు ? అనే విషయంలో క్లారిటీలేదు.

ఎన్నికల కమిషన్ ఏమో ఫారాలను ఓటర్లకు నూరుశాతం పంపిణీ చేశామని పదేపదే చెబుతోంది. అయితే తమకు ఫారాలు అందలేదని లక్షలాదిమంది ఓటర్లు మొత్తుకుంటున్నారు. కాబట్టి ఓటర్లకు ఫారాలు అందించే విషయంలో కమిషన్ చేస్తున్న ప్రకటనలు వాస్తవం కాదని అర్ధమవుతోంది. అందుకనే ఎస్ఐఆర్ ప్రక్రియ సాంతం వివాదాలతో ప్రతిరోజు నానా గోలవుతోంది. అయినా కమిషన్ మాత్రం పట్టించుకోవటంలేదు. అందుకనే జరుగుతున్న ప్రక్రియ తీరుపై ఎలక్షన్ కమిషనర్ పీ సుదర్శనరెడ్డికి పార్టీలు ఫిర్యాదులు చేశాయి. ఇక్కడ లాభంలేదన్న ఉద్దేశ్యంతో ఏకంగా ఢిల్లీకి వెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదులు చేయటం సంచలనంగా మారింది. దాంతో ఏమైందంటే తెలంగాణలో సర్ ప్రక్రియను ఆగస్టు 3వ తేదీవరకు పొడిగిస్తు భారత ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీచేసింది.

Read More
Next Story