LIVE తమిళ తీరాన్ని తాకిన ‘దళపతి’ సునామీ
x

తమిళ తీరాన్ని తాకిన ‘దళపతి’ సునామీ

జననాయకుడిగా మారిన విజయ్


Click the Play button to hear this message in audio format

దేశంలో నెలరోజుల పాటు సాగిన ఎన్నికల సమరం ముగిసింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం నాలుగు రాష్ట్రాలతో పాటు, పుదుచ్చేరీ కేంద్రపాలిత ప్రాంతం ఓట్ల లెక్కింపు మొదలయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే సాయంత్రం వరకూ తుది ఫలితాలు వెలువడి ఎవరూ గద్దెనెక్కుతారో తేలుతుంది.

విజయ్ కింగ్ మేకర్ అవుతాడా..

దేశంలో అత్యంత కీలకమైన తమిళనాడు ఎన్నికలలో తిరిగి డీఎంకే అధికారంలోకి వస్తుందా? మెజారిటీ ఎంత సాధిస్తారు? విజయ్ కింగ్ మేకర్ అవుతాడా? హంగ్ వస్తుందా? ఇవే ప్రశ్నలు అందరి మదిలో తలెత్తుతున్నాయి.
సంక్షేమ పథకాలు, ద్రవిడవాదంతో తిరిగి అధికారంలోకి వస్తామని స్టాలిన్ నమ్ముతున్నారు. అయితే పార్టీ ఎప్పుడూ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాలేదు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం డీఎంకే వైపే నిలిచాయి.
సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ భారీగా ఓట్లు చీలుస్తుందని అంచనాలు ఉన్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలలో టీవీకే ఒంటరిగా బరిలోకి దిగింది. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో టీవీకే 30 శాతం ఓట్లు, 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇది మొత్తం ఎన్నికల కథనాన్ని తలకిందులు చేసింది. ఇదే నిజమైతే భారత ఎన్నికల చరిత్రలో ఇదో సంచలనం అవుతుంది.

పుదుచ్చేరిలో..

30 స్థానాలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా బలంగా ఉండటంతో పోరు హోరాహోరీగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న అంశాలు కూడా వేగంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

కేరళ..

కేరళ అసెంబ్లీలో 140 స్థానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ రెండుసార్లు పీఠంపై ఉన్నారు. ఇప్పడు ఆయన హ్యట్రిక్ విజయంపై కన్నేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో 99 స్థానాలు సాధించి అధికారం చేపట్టారు. కానీ తరువాత అన్ని ప్రతికూల అంశాలు ఎల్డీఎఫ్ ను చుట్టుముట్టాయి. అవినీతి,కుంభకోణాలు వెలుగుచూడటంతో యూడీఎఫ్ బలం ఫుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ వామపక్షాలు ఓటమి పాలైతే దేశంలో ఉన్న చివరి అధికారకోట కూడా కోల్పోయినట్లు అవుతుంది.

పశ్చిమ బెంగాల్ లో..

ఉత్తరాదిన ఉన్న పశ్చిమ బెంగాల్ యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. 294 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 148. ఇక్కడ 2011 నుంచి టీఎంసీ అధికారంలో ఉంది. గత 15 ఏళ్లు పాలనలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది. దీనితో బీజేపీ బలంగా పోరాడింది. ఈసారి ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని మమతా బెనర్జీ వైపు, ఇంకొన్ని బీజేపీ వైపు నిలిచాయి. బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తే మరో పెద్ద రాష్ట్రం దాని సొంతమవుతుంది.
ఈసారి బెంగాల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి ఘర్షణలు, కర్ప్యూలు లేవు. పార్టీ కార్యాలయాలకు నిప్పులు పెట్టడం లాంటివి జరగలేదు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ వల్ల 27 లక్షల మంది ఓటర్లను తొలగించారు. దీనిపై టీఎంసీ వీధి పోరాటాలతో పాటు న్యాయ స్థానాలను ఆశ్రయించింది.

అస్సాం..

అస్సాంలో 126 స్థానాలు ఉన్నాయి. బీజేపీ మరోసారి ఫేవరేట్ గా బరిలోకి దిగింది. ఇక్కడ మరోసారి ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇదే జరిగితే వరుసగా మూడో సారి బీజేపీ అధికారం దక్కించుకున్నట్లు అవుతుంది.


Live Updates

  • 4 May 2026 11:07 AM IST

    ‘జననాయకుడిగా’ విజయ్..

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో సంచలన ఫలితాలు వస్తున్నాయి. కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ పార్టీ టీవీకే సంచలన ఫలితాల దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం వెలువడుతున్న పోల్ ప్రకారం ఆ పార్టీకి 108 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఆ పార్టీకి 118 స్థానాలు అవసరం.

    మరోవైపు డీఎంకే పార్టీ శ్రేణులన్నీ డీలా పడిపోయాయి. ఆ పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో డీఎంకే పార్టీ కార్యాలయమైన అన్నా అరివాలయంలో వేసిన టెంట్లను తీసివేశారు.

    ప్రస్తుతం టీవీకే పార్టీ కార్యాలయం చుట్టూ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికల సంఘం వెబ్ సైట్ ప్రకారం 97 స్థానాలలో టీవీకే ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీకి అన్నాడీఎంకే పార్టీ బలమైన పోటీ ఇస్తోంది. డీఎంకే కు చెందిన అగ్రనాయకులు వెనకబడి ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 62 కౌంటింగ్ కేంద్రాల నుంచి ఫలితాలు వెలువడుతున్నాయి. శాంతి భద్రతల కోసం భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. 

  • 4 May 2026 11:02 AM IST

    బెంగాల్ ట్రెండ్స్‌పై సువేందు అధికారి వ్యాఖ్యలు

    పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభ ఓట్ల లెక్కింపు ధోరణులపై ప్రతిపక్ష నేత, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి స్పందించారు. ఆయన మాట్లాడుతూ, హిందువులందరూ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ఏకమయ్యారని పేర్కొన్నారు. నాలుగు రౌండ్ల లెక్కింపు తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉందని అన్నారు. అలాగే, కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ ధోరణులపై వ్యాఖ్యానిస్తూ, హిందూ ఓట్లు ఎక్కువగా బీజేపీకి, ముస్లిం ఓట్లు ఎక్కువగా టీఎంసీకి వెళ్లాయని అభిప్రాయపడ్డారు. అయితే మాల్డా, ముర్షిదాబాద్, నార్త్ డినాజ్‌పూర్ ప్రాంతాల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని ఆయన తెలిపారు.

  • 4 May 2026 11:00 AM IST

    తమిళనాడులో టీవీకే, బెంగాల్ లో బీజేపీ, కేరళ లో కాంగ్రెస్..

    తమిళనాడు ఎన్నికలలో టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ దూసుకుపోతున్నారు. ఆ పార్టీ ఇప్పటికే వందకు పైగా స్థానాలో ఆధిక్యంలో దూసుకుపోతోంది. అధికార డీఎంకే కేవలం 56 స్థానాలలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే పార్టీ 75 స్థానాలలో దూసుకుపోతోంది.

    తమిళనాడు

    టీవీకే- 106

    ఏఐఏడీఎంకే- 75

    డీఎంకే- 50

    పశ్చిమ బెంగాల్

    బీజేపీ- 182

    టీఎంసీ- 106

    కేరళ

    యూడీఎఫ్- 85

    ఎల్డీఎఫ్- 42

    బీజేపీ- 1

    అస్సాం

    బీజేపీ- 97

    కాంగ్రెస్- 26

    ఏఐయూడీఎఫ్- 2

    పుదుచ్చేరి

    ఎన్ఆర్సీ- 16

    కాంగ్రెస్- 4

  • 4 May 2026 10:54 AM IST

    పుదుచ్చేరి ఫలితాలు: రంగసామి, AINRC ముందంజ

    పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ (AINRC) నేత ఎన్. రంగసామి సహా ఆయన పార్టీ అభ్యర్థులు పలు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం, రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన రంగసామి, తట్టంచావడి సీటులో 3,591 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

    ఇతర AINRC అభ్యర్థులు ఆర్. రవికుమార్, వైయాపురి మణికందన్, సి. అయ్యప్పన్, ఈ. మోహందాస్, పి. రాజవేలు, పి.ఆర్.ఎన్. తిరుమురుగన్ వరుసగా విల్లియనూర్, ముతియల్పేట్, ఆర్యంకుప్పం, ఎన్బలం, నెట్టపాక్కం, కారైకాల్ నార్త్ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థులు ఏ. నమస్సివాయం, టీ.కే.ఎస్. మీనాచ్చిసుందరం కూడా మన్నడిపేట్, నెరావి టి.ఆర్. పట్టినం సీట్లలో ముందంజలో ఉన్నారు.

  • 4 May 2026 10:53 AM IST

    గుజరాత్ బైపోల్: ఉంరేత్‌లో హర్షద్ పార్మర్ ముందంజ

    గుజరాత్ ఉంరేత్ అసెంబ్లీ బైఎన్నికలో బీజేపీ అభ్యర్థి హర్షద్భాయి పార్మర్ బలమైన ఆధిక్యం సాధించారు. కాంగ్రెస్ ప్రత్యర్థి భృగురాజ్‌సింహ్ చౌహాన్‌పై ఆయన ముందంజలో కొనసాగుతున్నారని తాజా లెక్కింపు ధోరణులు వెల్లడించాయి. అనంద్ జిల్లాలోని వలభ్ విద్యానగర్‌లోని బీజేవీఎం కాలేజీలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరిగింది. తొమ్మిదో రౌండ్ వరకు హర్షద్ పార్మర్ 33,745 ఓట్లు సాధించగా, చౌహాన్‌కు 23,310 ఓట్లు వచ్చాయి.

    ముగ్గురు స్వతంత్రులు, ఒక చిన్న పార్టీ అభ్యర్థి సహా మిగతా నలుగురు అభ్యర్థులు చాలా వెనుకంజలో ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే గోవింద్ పార్మర్ మృతి కారణంగా ఈ బైఎన్నిక జరిగింది. ఆయన కుమారుడైన హర్షద్ పార్మర్‌ను బీజేపీ బరిలోకి దించింది. ఇది ఆయన తొలి పెద్ద ఎన్నిక. ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్‌లో 306 బూత్‌లలో 59.04 శాతం ఓటింగ్ నమోదైంది.

  • 4 May 2026 10:52 AM IST

    భవానీపూర్‌లో దీదీ వెనుకంజ

    భవానీపూర్‌లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెనకంజలో ఉన్నారు. బీజేపీ నేత సువేంధు అధికారి 1558 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. 

  • 4 May 2026 10:48 AM IST

    ధర్మదంలో సీఎం పినరయి విజయన్ వెనుకంజ

    కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మదం నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఎన్నికల సంఘం ధోరణుల ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థి వి.పీ. అబ్దుల్ రషీద్ ఆయనపై 2,812 ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ రాష్ట్రంలో 71 సీట్ల మెజారిటీ మార్క్‌ను దాటి ఆధిక్యంలో నిలిచింది.

  • 4 May 2026 10:45 AM IST

    కేరళలో యూడీఎఫ్ మెజారిటీ దాటింది

    తాజా ఎన్నికల సంఘం ధోరణుల ప్రకారం, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేరళలో మెజారిటీ మార్క్ దాటింది. 140 స్థానాల అసెంబ్లీలో అవసరమైన 71 సీట్లను అధిగమించి, ప్రస్తుతం 71కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • 4 May 2026 10:42 AM IST

    స్పష్టమైన మెజారిటీతో మాదే సర్కార్: టీవీకే

    తమిళనాడులో టీవీకే భారీ మెజారిటీతో స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ జెరాల్డ్ ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపులో టీవీకే గణనీయ ఆధిక్యం సాధిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలంగా ఉన్న పార్టీలపై ప్రజల్లో అసంతృప్తి పెరగడంతో టీవీకేకు మద్దతు లభించిందని చెప్పారు. “50-75 ఏళ్ల అనుభవం ఉన్నా, అది రాష్ట్రాన్ని దోచుకునే అనుభవమే” అని విమర్శించారు. ప్రచార సమయంలో పార్టీ చీఫ్ విజయ్ మీడియాతో తక్కువగా మాట్లాడటంపై స్పందిస్తూ, ప్రజలతో నేరుగా కలవడానికే ఆయన ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. బయటి మద్దతు అవసరం లేకుండానే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఫెలిక్స్ జెరాల్డ్ స్పష్టం చేశారు.

  • 4 May 2026 10:39 AM IST

    తమిళనాడులో TVK సెంచరీ

    తమిళనాడు:

    TVK – 100

    AIADMK+ – 74

    DMK+ – 54

    పశ్చిమ బెంగాల్:

    BJP+ – 172

    TMC+ – 112

    కేరళ:

    UDF – 82

    LDF – 45

    BJP+ – 3

    అస్సాం:

    BJP+ – 97

    Congress – 23

    AIUDF+ – 2

    పుదుచ్చేరి:

    NRC+ – 16

    TVK+ – 4

Read More
Next Story