
తమిళ తీరాన్ని తాకిన ‘దళపతి’ సునామీ
జననాయకుడిగా మారిన విజయ్
దేశంలో నెలరోజుల పాటు సాగిన ఎన్నికల సమరం ముగిసింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం నాలుగు రాష్ట్రాలతో పాటు, పుదుచ్చేరీ కేంద్రపాలిత ప్రాంతం ఓట్ల లెక్కింపు మొదలయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే సాయంత్రం వరకూ తుది ఫలితాలు వెలువడి ఎవరూ గద్దెనెక్కుతారో తేలుతుంది.
విజయ్ కింగ్ మేకర్ అవుతాడా..
పుదుచ్చేరిలో..
కేరళ..
పశ్చిమ బెంగాల్ లో..
అస్సాం..
Live Updates
- 4 May 2026 10:31 AM IST
మహా బైపోల్స్: పవార్, కర్దిలే లీడ్
మహారాష్ట్ర బైఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా బారామతిలో సునేత్రా పవార్ భారీ ఆధిక్యం సాధించారు. మూడో రౌండ్ ముగిసే సరికి ఆమెకు 26,773 ఓట్లు వచ్చాయి. మిగతా అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఇంకా 100 ఓట్ల మార్క్ కూడా దాటలేదు.
పుణే జిల్లాలోని బారామతి నియోజకవర్గంలో 58.27% పోలింగ్ నమోదైంది. మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంతో ఈ బైఎన్నిక జరిగింది.
ఇక రాహురిలో బీజేపీ అభ్యర్థి అక్షయ్ కర్దిలే, ఎన్‌సీపీ (ఎస్‌పి) అభ్యర్థి గోవింద్ మోకటేపై 21,000కిపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నిక బీజేపీ ఎమ్మెల్యే శివాజీ కర్దిలే మృతి కారణంగా నిర్వహించబడింది.
- 4 May 2026 10:30 AM IST
టీవీకే అధినేత విజయ్ ఇంటి వద్ద భాారీ భద్రత
తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ తళపతి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అధికారిక ట్రెండ్స్ ప్రకారం టీవీకే పార్టీ ౬౮ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరికొన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్న వేళ ఆయన నివాసం దగ్గర భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి భద్రత కల్పిస్తున్నారు.
- 4 May 2026 10:19 AM IST
బాగల్‌కోటలో కాంగ్రెస్ లీడ్, దావణగెరె సౌత్‌లో బీజేపీ ముందంజ
కర్ణాటక అసెంబ్లీ బైఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర పరిస్థితి కనిపిస్తోంది. బాగల్‌కోటలో అధికార కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా, దావణగెరె సౌత్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఎన్నికల సంఘం ప్రకారం, బాగల్‌కోటలో కాంగ్రెస్ అభ్యర్థి ఉమేష్ మెటి, బీజేపీకి చెందిన వీరభద్రయ్య చరణ్తిమఠ్‌పై 5,016 ఓట్లతో ముందంజలో ఉన్నారు. దావణగెరె సౌత్‌లో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ టీ దసకరియప్ప, కాంగ్రెస్ అభ్యర్థి సమర్థ్ మల్లికార్జున్‌పై 577 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ బైఎన్నికలు సీనియర్ కాంగ్రెస్ నేతలు హెచ్.వై. మెటి, శమనూరు శివశంకరప్ప మృతి నేపథ్యంలో నిర్వహించబడ్డాయి. ఫలితాలు తక్షణ రాజకీయ సమీకరణాలను మార్చకపోయినా, కాంగ్రెస్-బీజేపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుగా మారాయి. మధ్యాహ్నానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
- 4 May 2026 10:13 AM IST
తమిళనాడు:
TVK – 84
AIADMK+ – 72
DMK+ – 55
పశ్చిమ బెంగాల్:
BJP+ – 168
TMC+ – 112
కేరళ:
UDF – 76
LDF – 47
BJP+ – 4
అస్సాం:
BJP+ – 92
Congress – 26
AIUDF+ – 1
పుదుచ్చేరి:
NRC+ – 16
TVK+ – 4
- 4 May 2026 9:56 AM IST
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు వెనుకంజ
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నేపథ్యంలో తొలి ధోరణులు ఆసక్తికరంగా మారాయి. ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతుండగా, అధికార కూటమికి చెందిన పలువురు మంత్రులు తమ నియోజకవర్గాల్లో వెనుకబడినట్లు సమాచారం. వీణా జార్జ్, ఎం.బి. రాజేష్, ఓ.ఆర్. కేలు, ఆర్. బిందు, జె. చించురాణి, పి. రాజీవ్, కె.బి. గణేశ్ కుమార్, రోషి ఆగస్టిన్ వంటి మంత్రులు ప్రారంభ రౌండ్లలో వెనుకంజలో ఉన్నట్లు టెలివిజన్ నివేదికలు తెలిపాయి. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ దాదాపు 80 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, సీపీఎం ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ సుమారు 50 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సుమారు ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తొలి ధోరణులు సూచిస్తున్నాయి.
- 4 May 2026 9:46 AM IST
తమిళనాడు: డీఎంకేను బీట్ చేసిన టీవీకే..
టీవీకే- 67డీఎంకే- 58అన్నాడీఎంకే- 56బెంగాల్ లో కమలం రెపరెపలు..బీజేపీ- 159టీఎంసీ- 119కేరళయూడీఎఫ్- 65ఎల్డీఎఫ్- 34బీజేపీ- 4అస్సాంబీజేపీ ప్లస్- 84కాంగ్రెస్- 23ఏఐయూడీఎఫ్- 2పుదుచ్చేరిఎన్ ఆర్ సీ ప్లస్- 13టీవీకే- 4 - 4 May 2026 9:41 AM IST
పెరంబూర్ లో విజయ్ కు ఆధిక్యం..
టీవీకే చీఫ్ పోటీ చేస్తున్నపెరంబూర్ లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే తిరుచ్చి ఈస్ట్ లోనూ ఇదే ఫలితం కనిపిస్తోంది. ఆయన ఈ రెండు స్థానాలలో పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాలు ఇంతకుముందు డీఎంకే చేతిలో ఉన్నాయి. చెన్నైని ఆనుకుని ఉన్న పెరంబూర్ లో 2.22 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.ఇక్కడ ద్రవిడియన్ పాలిటిక్స్ దే మొదటి నుంచి ఆధిపత్యం. డీఎంకే కు బలమైన పట్టు ఉంది. అయినప్పటికీ విజయ్ ముందంజలో ఉండటంతో ఆ పార్టీ వర్గాలు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాయి. 2021 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే అభ్యర్థి ఆర్ డీ శేఖర్ ఇక్కడ 52.53 శాతం ఓట్లు సాధించి విజయం సొంతం చేసుకున్నారు. - 4 May 2026 9:35 AM IST
తమిళనాడులో అన్నాడీఎంకే చాప్టర్ క్లోజ్?
తమిళనాడు ఎన్నికలలో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అన్నాడీఎంకే స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో విజయ్ పార్టీ అన్నాడీఎంకేను మించిపోయి స్పష్టమైన ఆధిక్యం కనపరిచింది. అయితే డీఎంకే కూటమికే ఈ ఎన్నికలలో స్పష్టమైన ముందంజ వేసింది.
- 4 May 2026 9:25 AM IST
భవానీపూర్ లో మమతపై సువేందు అధికారి ఆధిక్యం
పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో సీఎం మమతా బెనర్జీ వెనకంజ వేశారు. ఆమె కోల్ కతలోని భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి ప్రతిపక్ష నేత సువేందు అధికారి కూడా బరిలో ఉన్నారు. అయితే పోస్టల్ ఓట్లలో సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నారు. అలాగే అధికారి పోటీ చేస్తున్న నందిగ్రామ్ లో కూడా ముందంజలో ఉన్నట్లు తేలింది - 4 May 2026 9:21 AM IST
బెంగాల్ లో వంద సీట్లలో బీజేపీ లీడింగ్
బీజేపీ-109
టీఎంసీ- 89
తమిళనాడులో ఫుంజుకున్న టీవీకే
డీఎంకే- 59
అన్నాడీఎంకే- 27
టీవీకే- 27
కేరళ
యూడీఎఫ్- 39
ఎల్డీఎఫ్- 20
బీజేపీ- 5
అస్సాం
బీజేపీ- 60
కాంగ్రెస్- 18
ఏఐయూడీఎఫ్- 1
పుదుచ్చేరి
ఎన్ఆర్సీ- 10
టీవీకే ప్లస్- 5

