ఎగ్జిట్ పోల్స్ లైవ్: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల అంచనాలిలా!
x

ఎగ్జిట్ పోల్స్ లైవ్: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల అంచనాలిలా!

కేరళ, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్..


నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన భారీ ఎన్నికల ప్రక్రియకు ఈరోజుతో తెరపడింది. చివరి దశ పోలింగ్ పశ్చిమ బెంగాల్‌లో ముగియగా, దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు ఎగ్జిట్ పోల్స్‌పై నిలిచింది. ఈ ఎన్నికల సీజన్‌లో పలు దశల్లో పోలింగ్ జరిగింది. చివరి దశలో పశ్చిమ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో 90 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది ప్రజల ఉత్సాహాన్ని స్పష్టంగా చూపించింది.

ఇప్పుడు సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఈ అంచనాలు ప్రస్తుత ప్రభుత్వాల పరిస్థితిపై మొదటి సంకేతాలు ఇస్తాయి. కేరళ, అస్సాంలో అధికార పార్టీలు తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయా అనే విషయం తెలిసే అవకాశం ఉంది. అలాగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన గట్టిపోటీ ప్రచారం ఓటర్లపై ఎలా ప్రభావం చూపిందో కూడా అర్థమవుతుంది. పుదుచ్చేరి పోరులో ఎవరు ముందంజలో ఉన్నారో కూడా ఈ అంచనాలు సూచించవచ్చు. అయితే అసలు ఫలితాలు మే 4న ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రమే స్పష్టమవుతాయి. అప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలు కొనసాగనున్నాయి.

Live Updates

  • 29 April 2026 8:57 PM IST

    తమిళనాడు సీఎం విజయ్..: టీవీకే

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో సుమారు 30 సీట్లు వస్తాయని అంచనాలు వచ్చినప్పటికీ, తమిళగా వెట్రి కజగం (TVK) మాత్రం విజయం తమదేనని గట్టిగా నమ్ముతోంది. పార్టీ ప్రతినిధి రాధన్ పండిట్ మాట్లాడుతూ, “ఈ ఎగ్జిట్ పోల్స్‌ను పూర్తిగా పట్టించుకోవడం లేదు. 140కి పైగా, లేదా 170కి మించి సీట్లు సాధించి ఘన విజయం సాధిస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.

    “మేము బాగా అధ్యయనం చేశాం, మా సొంత సర్వే ఉంది. కనీసం 45% ఓటు బ్యాంక్‌పై మాకు నమ్మకం ఉంది—ఇది 20-25% కాదు. ఇంకా 108 గంటల్లో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 109వ గంటలో మేమే ప్రమాణ స్వీకారం చేస్తాం. మా విజయ్ అసాధారణంగా ముఖ్యమంత్రి అవుతారు” అని తెలిపారు.

  • 29 April 2026 8:55 PM IST

    బెంగాల్ పోల్స్: రెండో దశలో రికార్డ్ ఓటింగ్

    వెస్ట్ బెంగాల్‌లో రెండో దశ పోలింగ్‌లో 92.47% ఓటింగ్ నమోదై.. మొదటి దశ కంటే మరింత పెరిగింది అని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనోజ్ అగర్వాల్ తెలిపారు. పోలింగ్ ఎక్కువగా ప్రశాంతంగానే సాగింది, చిన్నచిన్న సంఘటనలు తప్ప పెద్దగా ఏమీ లేదు. కోల్‌కతాలో అయితే చరిత్రాత్మక స్పందన. ఇప్పటివరకు ఓటేయని వారూ పండుగలా భావించి బయటకు వచ్చి ఓటేశారు.

  • 29 April 2026 8:53 PM IST

    ఎగ్జిట్ పోల్స్‌పై మనోజ్ తివారీ ధీమా

    అస్సాం, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరిలో మేమే ముందంజలో ఉన్నాం. ఎగ్జిట్ పోల్స్ కూడా మా అంచనాలకే అనుగుణంగా ఉన్నాయి. కేరళలో కొంత బలహీనంగా ఉన్నా ఇప్పుడే కాకపోతే రేపైనా అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే. వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ మా నమ్మకాన్ని మరింత పెంచాయి. ఈసారి అన్ని వైపుల నుంచి మాకు ప్రేమ చూపిన ప్రజలకు కృతజ్ఞతలు.

  • 29 April 2026 8:00 PM IST

    ఆక్సిస్ మై ఇండియా ప్రకారం.. విజయ్

    తమిళనాడు అసెంబ్లీ ఫలితాలపై మిగిలిన సర్వే సంస్థల కన్నా ఆక్సిస్ మై ఇండియా భిన్నమైన అంచనాలను వెలువరించింది. ఆ సంస్థ ప్రకారం టీవీకే కు 98 నుంచి 120 సీట్ల వరకూ సాధించవచ్చని పేర్కొంది. 234 అసెంబ్లీ సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ఆ పార్టీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని అంచనా వేసింది. డీఎంకే 92 నుంచి 110 స్థానాలు, అన్నాడీఎంకే కేవలం 22 నుంచి 32 స్థానాలకు పడిపోతుందని వివరించింది.

    పీపుల్స్ పల్స్, మ్యాట్రిజ్, చాణక్య వంటి అన్ని సంస్థలు డీఎంకే వైపు మొగ్గు చూపగా ఒక్క ఆక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకే వైపు నిలిచింది. ఈ సంస్థలు టీవీకే మూడో స్థానానికి పరిమితం అవుతుందని కేవలం పది నుంచి 24 స్థానాలు విజయ్ ఖాతాలో పడతాయని సదరు సంస్థలు లెక్కలు వేశాయి

  • 29 April 2026 7:42 PM IST

    అస్సాం ఫలితాలు వేరేలా ఉంటాయి: కాంగ్రెస్

    అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంపై కాంగ్రెస్ స్పందించింది. ఆ పార్టీ నాయకులు నజీరా, దేబబ్రత సైకియా వంటి వారు ఎగ్జిట్ పోల్స్ ప్రజల మూడ్ ను ప్రతిబింబిచడం లేదని వ్యాఖ్యానించారు. ‘‘నేను ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల కావడం పై ఎలాంటి దృష్టి పెట్టదలుచుకోలేదు.’’ అని నజీరా అన్నారు. క్షేత్ర స్థాయి ప్రజల అభిప్రాయాలు ఇందులో లేవు. సామాన్యులు బీజేపీకి ఓటు వేయలేదు. ఎందుకంటే వారు ప్రజల సమస్యలను పట్టించుకోలేదు’’ అని ఆయన ఆరోపించారు.

    సైకియా మాట్లాడుతూ.. బీజేపీ గత పది సంవత్సరాలలో ఇచ్చిన హమీలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. బీజేపీ వచ్చిన దగ్గర నుంచి అస్సాంకు చెడు రోజులు దాపురించాయని విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 3.3 మిలియన్ యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారని అన్నారు. కేంద్రం, రాష్ట్రం ఈ అంశం గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు. దీనికి తోడు విపరీతమైన అవినీతి, ఇచ్చిన హమీలు అమలు చేయలేదని చెప్పారు

  • 29 April 2026 7:41 PM IST

    ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టిపారేసిన TMC

    పశ్చిమ బెంగాల్‌లో ఎగ్జిట్ పోల్స్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ఈ అంచనాలు వాస్తవ పరిస్థితులకు సంబంధం లేదని పార్టీ నేత కునాల్ ఘోష్ వ్యాఖ్యానించారు. పోలింగ్ ముగిసిన వెంటనే వచ్చిన సర్వేలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. ఈ అంచనాలు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదని ఆయన భావించారు. ఫలితాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ 235 సీట్లకు పైగా గెలుస్తుందని అంచనా వేశారు. అదే సమయంలో బీజేపీ ప్రదర్శన పరిమితంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ 50 సీట్లకు మించి గెలవలేదని ఆయన అభిప్రాయపడ్డారు.


  • 29 April 2026 7:37 PM IST

    ప.బెంగాల్ లో ఎగ్జిట్ పోల్ చూపిస్తున్నదృశ్యం




     


  • 29 April 2026 7:34 PM IST

    మా పనితీరును ఎగ్జిట్ పోల్స్ ప్రతిబింబించాయి: ఎలంగోవన్

    తమిళనాడు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో ఆధిక్యం కనిపించడంతో డీఎంకే స్పందించింది. ఈ ఫలితాలకు కారణం తమ ఐదేళ్ల పాలననే అని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన వెంటనే డీఎంకే నేత టీకేఎస్ ఎలంగోవన్ స్పందించారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన పనితీరు ప్రజల్లో విశ్వాసం పెంచిందని ఆయన అభిప్రాయపడ్డారు. తాజా ఆర్థిక గణాంకాలను ఉదాహరణగా చూపుతూ, తమిళనాడులో ఆర్థిక వ్యవస్థ రెట్టింపు అయిందని నివేదికలు చెబుతున్నాయని ఆయన వివరించారు.

    ఈ అభివృద్ధి రాష్ట్ర పాలనకు ప్రతిబింబమని తెలిపారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయకత్వం ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసిందని ఆయన సూచించారు. ప్రజలు ఆయనపై నమ్మకం ఉంచుతున్నారని, అదే కారణంగా మరోసారి ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని ఆశిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

  • 29 April 2026 7:33 PM IST

    స్పందించిన డీఎంకే

    నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలపై వివిధ సంస్థలు ముందస్తు అంచనాలను విడుదల చేశాయి. తమిళనాడులో మరోసారి డీఎంకేనే అధికారం నిలబెట్టుకుందని భావిస్తున్నాయి. దాదాపు మెజారిటీ సంస్థలు ఇవే అంచనాకు రావడంపై డీఎంకే స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు శరవణన్ అన్నాదురై మాట్లాడుతూ.. తాము ఈ ఫలితాలను ముందస్తుగానే ఊహించామని చెప్పారు. ఎన్నికలు ప్రారంభమైన తరువాత క్షేత్రస్థాయి నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసినప్పుడే అర్థమయిందని పేర్కొన్నార.

    తమ అంచనా ప్రకారం డీఎంకే కూటమి 180 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ఓటు షేర్ కూడా భారీ పెంచుకున్నామని పేర్కొన్నారు. తాము గత ఐదు సంవత్సరాలుగా అందించిన మంచి పాలన, సమర్థవంతమైన నాయకత్వం, సంక్షేమం తమను తిరిగి అధికారం నిలబెట్టుకునే వైపు నడిపించిందని అన్నారు. కూటమిని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమర్థవంతంగా నడిపించారని చెప్పారు. 

  • 29 April 2026 7:21 PM IST

    కేరళం లో ఎగ్జిట్ పోల్స్ చూపిస్తున్న దృశ్యం ఇది


    కేరళలో మొత్తం ( 140) మ్యాజిక్ ఫిగర్ (71)

    P MARQ ఎగ్జిట్ పోల్స్ సర్వే : మ్యాజిక్ ఫిగర్ 71

    • UDF (కాంగ్రెస్ కూటమి) 72 నుంచి 79 స్థానాలు

    • LDF ( పినరయ్ విజయ్ కూటమి) 62 నుంచి 69 స్థానాలు

    • ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది

    యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ : మ్యాజిక్ ఫిగర్ 71

    UDF (కాంగ్రెస్ కూటమి) 78 నుంచి 90 స్థానాలు

    LDF ( పినరయ్ విజయ్ కూటమి) 49 నుంచి 62 స్థానాలు

    బీజేపీ ఒకటి నుంచి 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశం

    పీపుల్స్ పల్స్‌ సర్వే

    ఎల్డీఎఫ్‌ 55 -65

    యూడీఎఫ్‌ 75-87

    ఎన్డీయే 0-3

    మ్యాట్రిజ్

    • ఎల్డీఎఫ్ : 60-65

    • యూడీఎఫ్ : 70-75

    • బీజపీ : 3-5

Read More
Next Story